నవ్వు ఓ దివ్యౌషధం 'మనం ఒత్తికి గురైనప్పుడు మెదడులో సానుభూతి (సింపథటిక్) విభాగం క్రియాశీలం అవుతుంది. ఆందోళనలను పరిహరించే రసాయనాలను ఈ సెట్ నాడులు విడుదల చేస్తాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితులకు మనిషిని సంసిద్ధం చేయడానికి దోహదం చేసే హార్మోన్లు విడుదల అవుతాం. ఈ ఒత్తిడి సుదీర్ఘ సమయం కొనసాగితే, ఆ అధిక స్పందన వల్ల రసాయనాలు దెబ్బ తింటాయి. ఇది శారీరక, మానసిక వ్యవస్థ పతనానికి దారి తీయవచ్చు' అని డాక్టర్ రహేజా వివరించారు.
అయితే, మానసిక లేదా శారీరక రుగ్మతలకు నవ్వు ప్రత్యక్ష చికిత్స కాదని మాక్స్ హెల్త్ కేర్ సంస్థ సైకియాట్రిస్ట్, మానసిక ఆరోగ్య విభాగం అధిపతి డాక్టర్ సమీర్ పారీఖ్ చెప్పారు. 'మీరు సంతోషంగా ఉన్నట్లయితే, ఆరోగ్యంగా ఉంటారు. అంతే' అని ఆయన అన్నారు. నవ్వే శక్తిని పెంచడానికి రోగులకు హాస్య సన్నివేశాలను చూపించడం వంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, హాయిగా ఉందనుకోవడానికి ఎవరైనా చేయవలసింది నవ్వడమేనని ఆయన సూచించారు.
'జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి మార్గాలలో హాస్యం ఒకటి' అని అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సందీప్ వోహ్రా అన్నారు.
Pages: -1- 2 News Posted: 8 February, 2010
|