కుర్ర 'కారు'
అహ్మదాబాద్ : లగ్జరీ కార్లు పెద్ద మనుషులకే పరిమితమా? జీవితమంతా కష్టపడి సంపాదించి పెద్ద వయస్సు వచ్చిన తరువాతే డాబు, దర్పానికి, సౌభాగ్య ప్రదర్శనకూ విఖ్యాతి కంపెనీల కార్లు కొంటారని మీ అభిప్రాయమా? ట్రెండ్ మారిపోయింది గురూ! కిర్రెక్కిన వయస్సు కుర్లాళ్లే ఈ కార్లలో షికార్లు చేస్తున్నారు. నూనూగు మీసాల నూత్న యవ్వనంతో పరవళ్ళు తొక్కుతున్న యువకులే కోటి రూపాయల ఖరీదైన కార్ల యజమానులవుతున్నారు. ఉదాహరణకు 'బిఎండబ్ల్యు ఎం3'ని తీసుకోవచ్చు. ఈ బవేరియన్ స్టైల్ కారు ధర అక్షరాలా 80 లక్షల రూపాయలు. బిఎండబ్ల్యు శ్రేణిలో తక్కువ సగటు కస్టమర్ వయస్సు ఉన్న కారు ఇదే. ఎం3 కార్లు కొనుగోలుదారులు యువకులే. వారిలో కొందరు 20, 30 ఏళ్ల మధ్య వయస్సున్నవారే. అయితే, 50 పైచిలుకు వయస్సు ఉన్నవారు కూడా ఈ కారు అంటే మోజు పడుతున్నారు. తాము చిరకాలంగా కోరుకున్న ఈ కారును వారు ఎట్టకేలకు కొనుగోలు చేస్తున్నారు.
ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కానవస్తున్న ఈ సరళి చివరకు ఇండియాకూ విస్తరించింది. మెర్సిడిస్ బెంజ్ ఇండియా కార్పొరేట్ అఫైర్స్, హెచ్ఆర్ విభాగం డైరెక్టర్ సుహాస్ కద్లాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'మా కస్టమర్ల సగటు వయస్సు పూర్వపు 50 నుంచి ఇప్పుడు 35, 40 స్థాయికి తగ్గిపోయింది. వివిధ రంగాలకు చెందిన యువ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, ప్రొఫెషనల్స్ లగ్జరీ కార్లను కొంటున్నారు. ఈ ధనిక వర్గం మా అమ్మకం స్థాయిలను పెంచుతున్నది' అని తెలియజేశారు.
క్రితం సంవత్సరం కొత్త సి-క్లాస్ ను, రెండు నెలల క్రితం కొత్త ఇ-క్లాస్ ను ప్రవేశపెట్టడం వల్ల మెర్సిడిస్ కార్ల అమ్మకాలు పెరిగాయి. తక్కువ వయోవర్గంలోని కస్టమర్లకు అవి అందుబాటులోకి వచ్చాయి. ఈ యువ కస్టమర్ పోర్ట్ ఫోలియో ప్రధానంగా ఇప్పటికే ఢక్కామొక్కీలు తిన్న వాణిజ్యవేత్తల కుటుంబాల వారసులతో కూడుకున్నది. మెర్సిడిస్ వజ్రాల వర్తకానికి పేరొందిన సూరత్ వంటి టైర్ 2 నగరంలో కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేసింది. 'లగ్జరీ కారు కొనుగోలుదారుడు రోజురోజుకు పిన్న వయస్కుడు అవుతున్నారు. సమాన నెలసరి వాయిదాలు (ఇఎంఐలు)పై ఇప్పుడు మెర్క్ లభ్యం అవుతుండడంతో డాక్టర్లు లేదా లాయర్లు వంటి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ప్రీమియం కారుపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సంస్థలు కూడా వడ్డీ రహిత ఇఎంఐ ఆప్షన్లను అప్పుడప్పుడు ఆఫర్ చేస్తున్నాయి' అని మెర్సిడిస్ డీలర్ 'బెంచ్ మార్క్ కార్స్' సంస్థ చైర్మన్ సంజయ్ ఠక్కర్ తెలియజేశారు. ఆయన ఫోక్స్ వాగన్ ఎజి, హోండా ఏజెన్సీలు కూడా ఉన్న డీలర్ షిప్ చైన్ ప్రమోటర్ కూడా.
యువ కొనుగోలుదారులను ప్రభావితం చేసే వాహనాల మోడల్స్ ను ఉత్పత్తి చేసే మోటారు వాహనాల సంస్థలకు ఈ సరళి లాభదాయకంగా ఉంటున్నది. తమ సంస్థ యువతను దృష్టిలో పెట్టుకుని కార్లకు రూపకల్పన చేస్తున్నదని బిఎండబ్ల్యు అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. 'మా కార్లు యంగ్ గా కనిపిస్తుంటాయి. ఎలా అయినా కొనాలనే ఆకాంక్షను కలిగిస్తుంటాయి' అని ఆయన తెలిపారు.
Pages: 1 -2- News Posted: 15 February, 2010
|