కుర్ర 'కారు'
ఏదైనా కారు ఈనాటి యువ కొనుగోలుదారులను ఇట్టే ఆకర్షించిందా ఇక ఆ కారు అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతాయి. చాలా సందర్భాలలో ఈ 'యంగ్' కార్ల అసలు వినియోగదారులు యువజనులే. ఇండియాలో రెండు నెలల క్రితం ప్రవేశపెట్టిన 'ఫోక్స్ వాగన్ బీటిల్' ఇదే విషయాన్ని నిరూపించింది. ఎక్కువగా తల్లిదండ్రులే దాదాపు 20 ఏళ్ల వయస్సున్న తమ పిల్లలకు కానుకగా కారును కొనుగోలు చేస్తున్నారని ఠక్కర్ చెప్పారు.
నిస్సాన్ ఇండియాకు కీలకమైన భాగస్వామి సంస్థ 'హోవర్ ఆటోమోటివ్ ఇండియా' అమ్మకాలు, మార్కెటింగ్, ఆపరేషన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అభిజీత్ పండిత్ ఈ సంగతి నిజమేనని చెప్పారు. 'ఎక్స్-ట్రెయిల్ కారుపై దాదాపు 40 ఏళ్ల వయస్సున్న కస్టమర్లు మోజు పడుతుండడాన్ని మేము గమనిస్తున్నాం. ఈ కస్టమర్ల ప్రధానంగా బహుళ జాతీయ సంస్థ (ఎంఎన్ సి)లలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు. పెరుగుతున్న ఆదాయాలు, విదేశాలకు వెళ్లినప్పుడు నిస్సాన్, ఇతర స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్ యువి) బ్రాండ్లను ఎక్కువగా గమనించడం ఇందుకు కారణం' అని పండిత్ వివరించారు.
నిస్సాన్ సంస్థ దేశంలో తన ఎస్ యువి ఎక్స్-ట్రెయిల్, టియానా కార్లను పూర్తి నిర్మిత యూనిట్ (సిబియు)లుగా కొంత కాలంగా విక్రయిస్తున్నది. తమ కస్టమర్ల సగటు వయస్సు సుమారు 40 సంవత్సరాలని సంస్థ తెలియజేసింది. కాగాక ఈ సంవత్సరం జనవరిలో మార్కెట్ లో ప్రవేశపెట్టిన నిస్సాన్ కొత్త స్పోర్ట్స్ కారు '370జడ్'కు వస్తున్న స్పందన కూడా ప్రోత్సాహకరంగా ఉంది. దీనిని ప్రవేశపెట్టిన మొదటి వారంలోనే 86 మంది వాకబు చేశారు. '370జడ్ కస్టమర్ల వయస్సు అంతర్జాతీయంగా ఒక మార్కెట్ నుంచి మరొక మార్కెట్ కు మారిపోతుంటుంది. పశ్చిమాసియాలో ఈ కస్టమర్లు బాగా పిన్నవయస్కులు. వారి వయస్సు 25, 30 మధ్య ఉంటుంది. ఇక అమెరికాలో 35, 45 వయోవర్గంలోని వారు దీనిని కొనుగోలు చేస్తుంటారు. రెండు సందర్భాలలోను 370జడ్ కస్టమర్లు ఆధునిక ఫ్యాషన్లను కోరుకునేవారే. ఖరీదైన, విలాసవంతమైన వస్తువులపై వారికి మోజు అధికం' అని పండిత్ వివరించారు.
ఈ ఆసక్తి పెరగడానికి అసలు కారణం బహుశా దేశంలో ప్రీమియం కారు మార్కెట్ అధికమవడం కావచ్చు. ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పటికీ, వ్యక్తిగత ఘనతలు ప్రదర్శించాలనే ఆకాంక్ష ఇంకా పోలేదు. 2009 సంవత్సరంలో జర్మన్ ప్రత్యర్థి కార్ల సంస్థలు మెర్సిడిస్, బిఎండబ్ల్యు అగ్ర స్థానం కోసం పోటీ పడ్డాయి. బిఎండబ్ల్యు 3619 కార్ల అమ్మకంతో అగ్ర స్థానం ఆక్రమించగా మెర్సిడిస్ 3247 కార్ల అమ్మకంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. కాగా దేశంలో లగ్జరీ కారు మార్కెట్ రూ. 26 లక్షల (మెర్సిడిస్ బెంజ్ సి క్లాస్) నుంచి రూ. 5 కోట్లు (మెర్సిడిస్ మేబాచ్) వరకు ఉంది.
Pages: -1- 2 News Posted: 15 February, 2010
|