'టాటా' సూపర్ బాస్!
ఫోర్ స్టర్ కు ఆటోమొబైల్ పరిశ్రమలో 24 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉంది. ఇటీవలి వరకు ఆయన జనరల్ మోటార్స్ యూరప్ అధిపతిగా ఉన్నారు. ఈ పదవిలో ఆయన షెవర్లె యూరోపియన్ కార్యకలాపాలను, ఓపెల్/వాక్సాల్, సాబ్ వాహనాల మార్కెటింగ్ ను పర్యవేక్షించారు. 2001లో జనరల్ మోటార్స్ లో చేరడానికి ముందు ఫోర్ స్టర్ బిఎండబ్ల్యులో 13 సంవత్సరాలు పనిచేశారు. ఆయన ఆ సంస్థలో బిఎండబ్ల్యు దక్షిణాఫ్రికా విభాగం మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆయన బిఎండబ్ల్యు మేనేజింగ్ బోర్డులో సభ్యుడుగా కూడా ఉంటూ వాహనాల ఉత్పత్తికి బాధ్యత వహించారు.
టాటా గ్రూపులో ఉన్న కొద్దిమంది విదేశీ సిఇఒలలో ఫోర్ స్టర్ ఒకరు కాగలరు. ఈ గ్రూప్ రెవెన్యూలో 65 శాతం విదేశీ మార్కెట్ల నుంచే వస్తుంటుంది. ఈ గ్రూప్ లో మరో ఇద్దరు విదేశీయులు రేమండ్ బిక్సన్, పాట్రిక్ మెక్ గోల్డ్ రిక్ టాప్ ఎగ్జిక్యూటివ్ లుగా ఉన్నారు. ఇండియా హోటల్ లో బిక్సన్, టాటా టెక్నాలజీస్ లో మెక్ గోల్డ్ రిక్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాగ్వార్, లాండ్ రోవర్ కాకుండా టాటా మోటార్స్ సంస్థకు దక్షిణా కొరియాలో టాటా దేవూ కమర్షియల్ వెహికిల్ కంపెనీ పేరిట ఒక సంయుక్త సంస్థ, స్పానిష్ బస్ తయారీదారు హిస్పానో కార్రోసెరా పేరిట మరొక సంయుక్త సంస్థ కూడా ఉన్నాయి. కాగా, సోమవారం ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థ వాహనాల అమ్మకాలు జనవరిలో 93 శాతం మేర పెరిగాయని, 85714 వాహనాల అమ్మకం జరిగిందని టాటా మోటార్స్ తెలియజేసింది.
2010 జనవరిలో జాగ్వార్ లాండ్ రోవర్ గ్లోబల్ అమ్మకాలు 195 శాతం పెరిగాయని, 16269 వాహనాల అమ్మకం జరిగిందని సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆ నెలలో 2974 జాగ్వార్ వాహనాలు, 13295 లాండ్ రోవర్ వాహనాలు అమ్ముడుపోయాయి. జాగ్వార్ అమ్మకాలు 122 శాతం మేర, లాండ్ రోవర్ అమ్మకాలు 219 శాతం మేర పెరిగాయి.
Pages: -1- 2 News Posted: 16 February, 2010
|