భాగ్యనగరిలో అద్దె గర్భాలు మొన్న జనవరి 28 వ తేదీన అద్దె తల్లి ఆష్టన్ కు జన్మనిచ్చింది. ఈ ఆడపిల్లను చూసి ఫిస్టర్ మురిసిపోయాడు.ఆష్టన్ అచ్చు తన పోలికలతోనే ఉందని, గడ్డం, పెదవులు తనవేనని గర్వంగా చెప్పుకొచ్చాడు. ఇంతకూ గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళకు నాలుగు లక్షల రూపాయలు చెల్లించారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అద్దె తల్లులకు గిరాకీ పెరుగుతోంది. విదేశ ఖాతాదారుల సంఖ్య పెరుగుతోందని, గర్భాన్ని అద్దెకు ఇచ్చే వ్యాపారం ఊపందుకుంటోందని అద్దె తల్లుల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ఏజెన్సీలు చెబుతున్నాయి. అలానే తమ గర్భాల అద్దెలను మహిళలు విపరీతంగా పెంచారని వారు వివరిస్తున్నారు.
గడచిన రెండు మూడు నెలల్లోనే ఈ అద్దెలు రెండింతలు అయ్యాయి. అద్దెకు గర్భాలను ఇచ్చే తల్లుల కోసం ప్రస్తుతం నాలుగు నుంచి నాలుగున్నర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిలో రెండున్నర లక్షల రూపాయలను మహిళకు ప్రసవానంతరం చెల్లిస్తున్నారు. మరో లక్ష రూపాయలు గర్భంతో ఉన్నప్పుడు చికిత్సలకు, ఆహారానికి వినియోగిస్తున్నారు. మిగతా యాభై వేలు అద్దె తల్లిని సమకూర్చిన రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ కు చెల్లిస్తున్నారు. క్రమేపీ ఈ వ్యాపారం హైదరాబాద్ లో మూడు తల్లులు, ఆరు జన్మలుగా ప్రవర్ధమానమవుతోంది.
Pages: -1- 2 News Posted: 19 February, 2010
|