3జి వేలానికి రెడీ: రాజా
ఇది ఇలా ఉండగా, 'ఈ వేలం జరిగేది ఈ సంవత్సరమా లేక వచ్చే సంవత్సరమా అనేది ప్రధానం కాదని నా భావన' అని క్యాబినెట్ కార్యదర్శి కె.ఎం. చంద్రశేఖర్ ఇంతకుముందు ఒకసారి అన్నారు. 'ప్రభుత్వం ఏవిధంగా గరిష్ఠ స్థాయిలో రెవెన్యూ రాబట్టగలదు అనే అంశంపైనే ఈ నిర్ణయం తీసుకోగలరని నా అభిప్రాయం' అని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగంలోని బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ లకు ఇప్పటికే కేటాయించిన ఒక స్లాట్ తో పాటు నాలుగు స్లాట్ లను వేలం వేయాలని ప్రభుత్వం లోగడ నిర్ణయించింది. ఒక్కొక్క స్లాట్ కోసం రూ. 3500 కోట్లను ప్రాథమిక ధరగా ప్రభుత్వం నిర్థారించింది.
వాస్తవానికి 3జి సర్వీసులను 2007లోనే ప్రారంభించవలసి ఉంది. కాని రక్షణ దళాలు స్పెక్ట్రమ్ ను ఖాళీ చేయడంలో, బిడ్ ధరల నిర్థారణలో సమస్యల వల్ల ఈ ప్రక్రియ పదేపదే ఆలస్యం అవుతూ వచ్చింది. ఇది టెలికమ్ రంగానికి నష్టం కలిగిస్తున్నది. ఆపరేటర్లకు వస్తున్న రెవెన్యూలు, లాభాలు తగ్గిపోకుండా ఈ అత్యాధునిక సర్వీసులు నిరోధించి ఉండేవి. కాగా, భద్రతాపరమైన కారణతో ప్రభుత్వం మొబైల్ నంబర్ పోర్టబిలిటీని కూడా రెండు నెలల పాటు అంటే మే నెల వరకు వాయిదా వేసింది. మొబైల్ సర్వీసుల వినియోగదారులు తమ నంబర్లను అట్టిపెట్టుకుంటూనే ఒక ఆపరేటర్ నుంచి మరొక ఆపరేటర్ కు మారడానికి ఈ పోర్టబిలిటీ అవకాశం కల్పిస్తుంది. తొలుత ఈ సర్వీసును 2009 డిసెంబర్ 31న ప్రారంభించాలని అనుకున్నారు. కాని ఆతరువాత ప్రారంభ కార్యక్రమాన్ని మార్చి 31కి వాయిదా వేశారు.
Pages: -1- 2 News Posted: 24 February, 2010
|