వలపుల పైనా 'నెట్'వల! ఈ సర్వేలో 18 నుండి 44 ఏళ్ల మధ్యల వయస్కుల రోజువారి పని వివరాలను సేకరించింది. 80 శాతం మందికి భార్య ఉన్నా లేకున్నా నెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందేనని ఈ సర్వేలో తేలింది. ఒక్కరోజు నెట్ అందుబాటులో లేకున్నా ఏదో కొల్పోయినట్లుగా వీరుంతా నీరస జీవులుగా ఫీలవుతున్నట్లు సర్వేలే తేలిందని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇంటర్నెట్ ను 49 శాతం మంది మొబైల్ ఫోన్లలో వాడుతుండగా, మరో 46 శాతం మంది టీవీలతూనూ కాలక్షేపం చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఉదయాన్నే నిద్ర లేవగానే 25 శాతం మంది నెట్ లో మొయిల్ , సోషల్ నెట్ వర్క్ బ్రౌజ్ చూస్తూనే కళ్లు తెరుస్తున్నట్లు సర్వే పేర్కొంది.
అలాగే 94 శాతం మంది రోజుకు ఒక్కసారైనా తమ ఇ- మెయిల్ ను వాడుతున్నట్లుగా తేలింది. అలాగే 64 శాతం మంది యువకులు ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనే కాలక్షేపం చేస్తున్నట్లు సర్వేలో స్పష్టమైంది. వీరంతా టీవీపై మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని, ఎప్పుడో వారానికోసారి కూడా లివింగ్ రూమ్ లో టీవీ చూడటం కష్టమేనని సర్వే తెలినట్లు ఆ సంస్థ వెల్లడించింది. పోనీ ఏ పనీ చేయడం లేదని భార్య లబోదిబో మన్నా బ్రౌజింగ్ తో కాపురం చేస్తున్న శ్రీవారు నెట్ లో కూడా పనికొచ్చే పనేమీ చేయడం లేదని తేలడం కొసమెరుపు.
Pages: -1- 2 News Posted: 24 February, 2010
|