కొడుకును చంపేసిన తల్లి ఒక దశాబ్దం క్రితం కేప్ పశ్చిమ ప్రాంతంలో టిక్ సేవించేవారి సంఖ్య 12 వేల కన్నాతక్కువగా ఉండేది. ఇప్పుడు వారి సంఖ్య లక్షా 20 వేలు అని అంచనా. తన రక్తం పంచుకు పుట్టిన కుమారుని చంపాలన్న తన నిర్ణయం గురించి ఆమె వివరిస్తూ, 20 ఏళ్ల అబ్బీ బయటకు వెళ్లే ముందు టిక్ కొనడానికి డబ్బు కోసం ఇంటి ఆవరణలో కేకలు వేస్తూ, రకరకాలుగా ప్రాధేయపడినట్లు చెప్పింది. అయితే, ఈ దఫా అతని వేడుకోళ్లను పక్కీస్ ఖాతరు చేయలేదు. ఆమె అండర్ వేర్ తో సహా ఆమె దుస్తులలో చివరిది కూడా మాయమైంది. అంటే మాదకద్రవ్యాల కోసం అబ్బీ అమ్మేశాడన్నమాట. అంతకు ఒక వారం క్రితం ఆమె కుమారుడు రెండు కత్తెరలతో ఆమెపైకి లంఘించాడు. ఆమె చివరికి దిగివచ్చింది. తన ప్రాణం కాపాడుకోవడానికి ఆమె తన జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా అతనిపైకి విసిరివేసింది.
అతనిని తాను ఏవిధంగా చంపిందీ ఆమె పూసగుచ్చినట్లు వివరించింది. తన ఇంటి వెలుపల ఉన్న అబ్బీ క్యాబిన్ లోకి ప్రవేశించిన పక్కీస్ కు ఒక తెల్లటి తాడు కనిపించింది. ఆమె దానిని ఉరి తాడుగా మార్చి, అతను స్పృహలేని స్థితిలో ఉన్నప్పుడు అతని మెడకు బిగించింది. పక్కీస్ అతని మెడకు దానిని ఎంత గట్టిగా బిగించిందంటే దాని ప్రభావానికి అతని మెడ కోసుకుపోయింది. ఆమె కుమారుని ప్రాణాలు గాలిలో కలిశాయి. ఆమె కేసు కోర్టుకు రావడానికి 15 నెలల వ్యవధి పట్టింది. తన కుమారుని హత్య చేసినట్లు ఆమె 2008 డిసెంబర్ లో ఒప్పుకున్నది. ఆమెకు మూడేళ్ల కారాగార శిక్ష విధించారు. ఇప్పుడు పక్కీస్ తాను పడిన బాధల గురించి చెప్పనారంభించింది. తన కష్టాలు యువ నేరస్థులలో మార్పు తీసుకువస్తున్నదని ఆమె చెబుతున్నది.
Pages: -1- 2 News Posted: 1 March, 2010
|