అంతా ముగిసింది: ఎంఎఫ్ తన నంబర్ రావడంతో హుస్సేన్ నెమ్మదిగా రెండవ వరుసలో నుంచి మొదటి వరుసలోకి కదిలారు. ఆతరువాత ఆయన తన జేబులో నుంచి ఒక చిన్న పుస్తకం బయటకు తీసి చదవనారంభించారు. అది ఖురాన్. చివరి క్షణంలో దైవానుగ్రహం కోసం ఆయన బహుశా ప్రార్థన చేస్తుండవచ్చు. ఒక సహాయకుడు కొన్ని పత్రాలతో ఆయన వద్దకు రాగా, ఆయన వాటిపై సంతకాలు చేశారు. దానితో ఒక అధ్యాయం ముగిసినట్లయింది. ఆయన నెమ్మదిగా ఆఫీసులో నుంచి తన కారు వద్దకు వెళుతుండగా ఒక అభిమాని 'సార్, మేము మిమ్మల్ని అభిమానిస్తున్నాం' అని చెప్పారు.
'హిందుత్వ విజయం'
ఇది ఇలా ఉండగా, చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ కు ఖతార్ తమ దేశ పౌరసత్వం ఇవ్వడం హిందుత్వ శక్తులకు 'విజయం' అని, హిందూ మతాన్ని 'కించపరిచే' వారికి దేశంలో చోటు లేదని బజరంగ్ దళ్ వ్యాఖ్యానించింది. 'హిందూ దేవతలను, మతాన్ని న్యూనత పరిచే విధంగా ఉన్న హుస్సేన్ చిత్రాలు మాకు ఆమోదయోగ్యం కావు' అని బజరంగ్ దళ్ కన్వీనర్ ప్రకాశ్ శర్మ స్పష్టం చేశారు. 'ఇది హిందుత్వ శక్తులకు విజయం. ఎందుకంటే అటువంటి వారికి దేశంలో స్థానం లేదు' అని ఆయన చెప్పారు. అటువంటి భావజాలం ఉన్న మరే రచయిత అయినా లేదా చిత్రకారుడు అయినా ఇతర దేశ పౌరసత్వం కోరుకోవాలని, ఎందుకంటే 'మా పార్టీ వారి పట్ల నిరనస వ్యక్తం చేస్తుంది' అని శర్మ పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 2 March, 2010
|