విమాన చార్జీల మోత
హైదరాబాద్ లో 'ఇండియా ఏవియేషన్ 2010'కి వచ్చిన ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, విమానయాన పరిశ్రమ సంక్షోభంలో నుంచి గట్టెక్కుతున్నదని చెప్పారు. 'అందువల్ల, ఈ పన్నును పూర్తిగా తొలగించాలని నా అభిప్రాయం' అని చెప్పారు. 'మా విజ్ఞప్తిని ఆర్థిక శాఖ సానుభూతి'తో పరిశీలించవచ్చునని పటేల్ సూచించారు. కింగ్ ఫిషర్ సంస్థ చైర్మన్ విజయ్ మల్యా మాట్లాడుతూ, 'విమాన చార్జీలలపై సర్వీస్ పన్ను ప్రభావాన్ని మేము మదింపు వేస్తున్నాం. చార్జీల సవరణపై మేము వచ్చే వారానికి తుది నిర్ణయం తీసుకోగలం' అని తెలియజేశారు. ఎటిఎఫ్ ధరలలో ఏమాత్రం హెచ్చింపునైనా భరించే స్థితిలో విమాన సంస్థలు ఇక ఏమాత్రం లేవని ఆయన చెప్పారు. 'అయితే, విమాన సంస్థలు ప్రకటించిన విమాన చార్జీలలో తగినంత వెసులుబాటు ఉన్నది. అందువల్ల విమాన సర్వీసులు దెబ్బ తినవు' అని విజయ్ మల్యా అభిప్రాయం వెలిబుచ్చారు.
ఆర్థిక మంత్రిత్వశాఖ తీసుకునే నిర్ణయం కోసం తమ సంస్థ వేచి ఉంటుందని ఇండిగో సంస్థ అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ తెలియజేశారు. 'పన్ను విధించేది మౌలిక చార్జీపైనా లేక పూర్తి చార్జీపైనా అనే అంశాన్ని బట్టి చార్జీల హెచ్చింపు జరుగుతుంది' అని ఘోష్ చెప్పారు. కాగా, ఏప్రిల్ - జూన్ కాలంలో విమాన సర్వీసులు దాదాపు 15 శాతం వృద్ధి చెందగలవని ఆసియా పసిఫిక్ పౌరవిమానయాన కేంద్రం (సిఎపిఎ) దక్షిణాసియా విభాగం అధిపతి కపిల్ కౌల్ సూచించారు. అయిే, చార్జీలను విపరీతంగా పెంచితే ఈ వృద్ధి రేటులో 3 శాతం వరకు తగ్గుదల ఉండవచ్చునని ఆయన అన్నారు. ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ జాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'ఈ భారాన్ని ఏవిధంగా మేము భరించగలమే చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే, ఇది లీన్ సీజన్ కూడా. మేము భరించలేకపోతే చార్జీలను మేము హెచ్చించవలసి ఉంటుంది' అని జాదవ్ అన్నారు.
Pages: -1- 2 News Posted: 4 March, 2010
|