ఇళ్ళ రుణాలు భారమే!
ముంబయి : వడ్డీ రేట్లు పెంచి రుణ గ్రహీతల నడ్డి విరిచేందుకు బ్యాంకులన్నీ రెడీ అవుతున్నాయి. ఇకపై మంజూరు చేసే లోన్ లపై వడ్డీ రేట్లు భారీగా పెంచాలని బ్యాంకులు నిర్ణయించాయి. ముఖ్యంగా గృహ, వాహన రుణాలపై భారీ మొత్తంలో వడ్డీ రేట్లు పెంచుతూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు కొత్త రుణ విథానాన్ని ప్రకటించగా, మిగిలిన బ్యాంకులు కూడా ఈదే బాటను అనుసరిస్తున్నాయి. గృహరుణాలపై 50 బేసిస్ పాయింట్ల వరుకూ, వాహన రుణాలపై 25 నుండి 100 వరకు బేసిస్ పాయింట్లు పెంచేందుకు బ్యాంకులు రంగం సిద్ధం చేస్తున్నాయి. అలాగే గృహ రుణాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లపై అదనంగా మరో 0.5 శాతం మించి పెంచాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఆలాగే వాహన రుణాలపై 0.25 నుండి 1 శాతం మధ్యలో ఆదనంగా వడ్డీ విధిస్తున్నాయి. దీంతో అతి చౌకగా రుణాలు లభించే కాలం ఇక ముగిసినట్లవుతుంది.
ప్రైవేటు రంగంలో అతి పెద్ద బ్యాంకు అయిన ఐసీఐసీఐ ఇటీవల చౌకగా రుణాలు మంజూరు చేసే ప్రత్యేక హౌసింగ్ లోన్ పథకాన్ని వెనక్కి తీసుకుంది. మార్చి 1 నుండి ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత రుణ విధానం ప్రకారం 30 లక్షల వరుకు రుణాలపై 8.75 శాతం, 30 నుండి 50 లక్షలు మధ్యలో అయితే 9 శాతం, 50 లక్షల పైబడిన రుణాలపై 9.50 శాతం వడ్డీ విధిస్తున్నట్లు ఆ బ్యాంకు ప్రకటించింది. ఇదే బాటలో కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా పయనిస్తోంది. హోమ్ లోన్లపై 50 వరకు బేసిస్ పాయింట్లను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్ బి ఐ కూడా వడ్డీ రేట్ల సవరణ బాట పట్టింది. ఆటో, హోమ్ లోన్లపై 8 శాతం వడ్డీకి రుణాలు మంజూరు చేస్తున్న పథకానికి ఎస్ బి ఐ మార్చి నెలాఖరుతో స్వస్తి పలకనుంది.
Pages: 1 -2- News Posted: 5 March, 2010
|