ఇళ్ళ రుణాలు భారమే!
ముఖ్యంగా వాహనరుణాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచేందుకు దాదాపుగా అన్ని బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. వాహన రంగానికి రుణాలు మంజూరు చేయడంలో హెచ్ డి ఎఫ్ సి బ్యాంకుదే అగ్రస్థానం. ఈ బ్యాంకు ఇప్పటివరకు 18,000 కోట్లు రూపాయల వరకు వాహన రుణాలను మంజూరు చేసింది. మార్చి 5 తేదీ నుండి ఈ బ్యాంకు కూడా 50 నుండి 100 బేసిస్ పాయింట్ల మధ్యలో వడ్డీ రేట్లు పెంచాలని భావిస్తోంది.ప్రస్తుతం 9 నుండి 10.5 శాతం మధ్యలో ఉన్న వడ్డీ రేట్లను 9.5 శాతం 11.5 శాతానికి పెంచేందుకు రంగం సిద్ధమైందని ఆ బ్యాంకు ప్రతినిధి ఒకరు చెప్పారు. అత్యంత ఖరీదైన కార్ల కొనుగోలు చేసే వారికి మాత్రం 100 బేసిస్ పాయింట్ల మేరకు రుణాలు మంజూరు చేస్తామని ఆయవ వివరించారు. ఐసీఐసీఐ బ్యాంకు వాహన రుణాలపై వడ్డీ రేట్లను 25 నుండి 50 బేసిస్ పాయింట్ల మధ్యలో పెంచాలని నిర్ణయించగా, కొటక్ మహీంద్రా బ్యాంకు మాత్రం 25 బేసిస్ పాయింట్ల వరుకు పెంచాలని భావిస్తోంది. రుణ గ్రీహీతల నుండి 75 బేసిస్ పాయింట్ల వరకు బ్యాంకులు సొమ్ము చేసుకునేందకు సిద్దమవుతున్నాయి.
బ్యాంకులు ప్రస్తుతం అందుబాటులో ఉంచిన రుణ విధానాన్ని ఆర్ బీ ఐ పూర్తిగా తప్పుపట్టింది. ఈ విధానం కారణంగా రుణగ్రహీతకు తప్పితే వేరే ఎవ్వరికీ ప్రయోజనం లేదని విమర్శించింది. దీంతో బ్యాంకులన్నీ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా పెంచాయి. రిజర్వ్ బ్యాంక్ 36,000 కోట్ల రూపాయల ద్రవ్యతను మాత్రమే బ్యాంకులకు అందుబాటులో ఉంచుతోందని, ఈ కారణంగా తమపై ఒత్తిడి పెరిగి రేట్లు పెంచాల్సి వస్తోందని హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ట్రేడింగ్ హెడ్ ఆశిష్ పార్థసారథి చెప్పారు. 'ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. రుణాల కోసం ఒత్తిడి వస్తుండటంతో వడ్డీ రేట్లు పెంచక తప్పడం లేదు' అని కోటక్ మహీంద్రా బ్యాంక్ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. వడ్డీ రేట్లను మేము కొద్ది రోజులు గమనించి, ఆ తరువాత పరిస్థితులను అనుసరించి పెంపు నిర్ణయం తీసుకుంటామని యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎస్కే చక్రవర్తి చెప్పారు.
Pages: -1- 2 News Posted: 5 March, 2010
|