వేటాడిన ఒంటరితనం జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ (ఎన్ టిపిసి)లో అధికారిగా రిటైరైన మనోరంజన్ స్పృహలేని స్థితిలో కనిపించారు. విషాహారం సేవించిన తీవ్ర లక్షణాలతో ఆయనను పీర్లెస్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. బెంగళూరులోనే ఒక ఇన్ స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన తరువాత క్రితం సంవత్సరం ఆ నగరంలోనే ఒక సంస్థలో ట్రెయినీగా చేరిన దేవ్ జ్యోతి ఈ విషాద సమాచారం అందుకున్న తరువాత గురువారం మధ్యాహ్నం కోలకతాకు చేరుకున్నారు. ఈ విషాద సంఘటనలో అనుమానించడానికి కారణమేదీ కనిపించడం లేదని, బెంగాలీలో రాసిన ఆత్మహత్య లేఖ నమ్మదగినదిగా కనిపిస్తున్నదని, తమ ఒంటరితనంతో వారు 'విసుగెత్తిపోయార'ని ఆ లేఖ సూచిస్తున్నదని దక్షిణ 24 పరగణాల జిల్లా పోలీస్ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వారు తమ ఈ చర్యకు ఎవరినీ బాధ్యులను చేయలేదని ఆయన తెలిపారు.
'ఆత్మహత్య లేఖను మేము శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలిస్తాం. చేతిరాత విశ్లేషకునితో దానిని పరిశీలింపచేయిస్తాం' అని దక్షిణ 24 పరగణాల జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (ఎఎస్ పి) ఎస్.కె. చౌధురి తెలియజేశారు.
సర్కార్ దంపతులు 'అందరి వంటి' జంట అని వారి ఇరుగుపొరుగులు చెప్పారు. 'వారు ఇటువంటి పని చేస్తారని మేము ఊహించలేదు' అని అదే భవనంలో మూడవ అంతస్తులో నివసిస్తున్న వ్యక్తి చెప్పారు. ఆయన వారిని చివరిసారిగా సుమారు వారం క్రితం చూశారు. మార్కెట్ నుంచి వంకాయలు, పచ్చి మిర్చి కొనుక్కుని రావలసిందని తనతో 'సోమవారం సాయంత్రమో లేక మంగళవారం సాయంత్రమో' చెప్పినప్పుడే వారిని తాను చివరిసారిగా చూశానని భవనం గేట్ కీపర్ తెలియజేశాడు. 'వారు మామూలుగానే కనిపించారు' అని అతను గుర్తు చేసుకుంటున్నట్లుగా చెప్పాడు.
Pages: -1- 2 News Posted: 5 March, 2010
|