అమ్మో! ఆడాళ్ళ షాపింగ్!! ఆర్జన శక్తిని పెంచుకుంటూనే అదే సమయంలో విపరీతంగా ఖర్చుపెడుతున్న నవతరం మహిళలకు ప్రతినిధులు సంగీత, కాంచన. విద్యాధికులు, ఉద్యోగినులు, కష్టపడి పనిచేసే, విజ్ఞతతో కొనుగోలు నిర్ణయాలు తీసుకునే, ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం ఇస్తున్న బలమైన శక్దిగా రూపుదిద్దుకుంటున్న పట్టణ ప్రాంత మహిళలకు ప్రతీకలుగా నిలుస్తున్న వారిలో వారిద్దరు కూడా ఉన్నారు. ఈమధ్య కాలం వరకు కూడా కూరలో కరివేపాకులా గృహిణిని ఇంటికి కావలసిన సరుకులు కొన్నప్పుడు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. కాని ఇప్పుడో సీను రివర్సైపోయింది.
కొనుగోళ్లపై మహిళల ప్రభావం పెరుగుతున్నదనడానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బిసిజి) నివేదికే సూచిక. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏటా వినియోగదారులు చేసే దాదాపు 18.4 ట్రిలియన్ డాలర్ల వ్యయంలో 65 శాతంపై మహిళల ప్రభావం ఉంటున్నది. ఇది 12 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ 550 లక్షల కోట్లు) అన్నమాట. మరొక విధంగా చెప్పాలంటే ఇది భారతదేశ జిడిపికి దాదాపు పదింతలు ఉంటుంది. (బిసిజిలో భాగస్వాములు, 'విమెన్ వాంట్ మోర్' రచయితలు మైకేల్ జె సిల్వర్ స్టెయిన్, కేట్ సాయెర్ మరొక వ్యాసంలో మహిళలు పెట్టే ఖర్చును 20 ట్రిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. ఇది వచ్చే ఐదేళ్లలో 28 ట్రిలియన్ డాలర్లకు పెరగవచ్చునని వారు సూచించారు.)
బిసిజి అంచనా ప్రకారం, వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆదాయం 13 ట్రిలియన్ డాలర్ల నుంచి 18 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుంది. 5 ట్రిలియన్ డాలర్ల మేరకు ఉండే ఈ పెరుగుదల చైనా, ఇండియా సంయుక్త జిడిపిలో వృద్ధికి దాదాపు రెట్టింపు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం అంతకంతకు మహిళలు ఉద్యోగాలలో చేరడం. అమెరికాలో ఉద్యోగినుల సంఖ్య ఉద్యోగుల సంఖ్యను దాటిపోయింది. వేతన వ్యత్యాసాలు కూడా తగ్గిపోతున్నాయి. ఇంకా అనేక మంది మహిళలు సీనియర్, టాప్ మేనేజ్ మెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 6 March, 2010
|