వేధించే కోడళ్లు! 'భార్యలు మాత్రమే మహిళలా? భర్త తల్లులు, అక్కచెల్లెళ్ళ మాటేమిటి? ఇది కేవలం భార్యను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన చట్టం' అని లతా మిశ్రా అనే బాధితురాలు అన్నారు. ఆమె వారం వారం డయాలసిస్ చేయించుకోవలసి ఉంటుంది. కాని ఆ కుటుంబం నుంచి వేరుపడిన కోడలు ఆరతి తన పట్ల క్రూరంగా ప్రవర్తించారంటూ ఆమె కుమారుడు నారాయణ్ పైన, మానసిక స్వస్థతలేని ఆమె కుమార్తెతో సహా ఇతర కుటుంబ సభ్యులపైన ఫిర్యాదు దాఖలు చేసినప్పుడు ఆమె ఆరోగ్య స్థితిని కూడా ఖాతరు చేయకుండా అరెస్టు చేశారు.
వైద్య కారణాలపై లత, ఆమె కుమార్తె అదే రోజు బెయిలు పొందినప్పటికీ ఆమె భర్త 48 గంటలపాటు జైలులో గడపవలసి వచ్చింది. ఆయనను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు. 'ఆయన ఏకైక సంపాదనపరుడు. మా కుమార్తె పక్షవాతం రోగి. ఆత్యహత్య చేసుకోవాలని తరచు అనుకునేవారం' అని ఆమె చెప్పారు. కాని మషాల్ సమయానికి జోక్యం చేసుకొని వారు అటువంటి పనికి పాల్పడకుండా నిరోధించింది. 'మా వంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారని మేము గ్రహించాం. మేము పోరాడుతున్నాం' అని ఇప్పుడు న్యాయ శాస్త్రం అభ్యసిస్తున్న నారాయణ్ చెప్పారు.
ఈ బృందం గడచిన ఎనిమిది మాసాలుగా ప్రతి ఆదివారం సమావేశమవుతూ, వివిధ ఫిర్యాదులను పరిశీలిస్తున్నది. డబ్బు 'దండుకోవడానికి' మహిళలు తరచు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఈ బృందం సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు ఈ చట్టం సరైన అడుగేనని చాలా మంది అంగీకరిస్తున్నారు. కాని దీని దుర్వినియోగం 'లీగల్ టెర్రరిజం'కు దారి తీస్తున్నదని బృందం అభిప్రాయం వెలిబుచ్చింది.
'చాలా కేసులలో బెయిల్ వెంటనే దొరకకుండా చూడటానికి శుక్రవారం ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారు' అని మినాల్ వర్మ చెప్పారు. ఆమె కోడలు నాలుగు సంవత్సరాల క్రితం ఆమె కుటుంబంపై ఫిర్యాదు దాఖలు చేసింది. ధనికులు, విద్యాధికులే తరచు 498ఎ కింద ఫిర్యాదులు దాఖలు చేస్తుంటారు. కాని దీని దుర్వినియోగం గురించి వరుసగా ఆరోపణలు రాసాగిన తరువాత కొన్ని సంవత్సరాలుగా ఆచితూచి ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 8 March, 2010
|