తిరుమలలో కొత్త క్యూ లైన్
తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో సర్వదర్శనానికి వెళ్ళే భక్తుల కోసం నూతనంగా ఒక క్యూలైన్ ను ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్ ను తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారైన ఈఓ రమణాచారి శనివారం ప్రారంభించారు. శ్రీవారి పరమభక్తుడైన అనంతాళ్వార్ చెరువును తిలకిస్తూ వెంకన్న దర్శనానికి వెళ్ళే విధంగా ఈ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ క్యూలైన్లలో మంచినీటిని, టీవీలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తిరుమలలో రద్దీ బాగా పెరిగిపోవడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు 14 గంటలపాటు వేచి ఉండవలసి వస్తోంది.
శ్రీవారి సేవలో మాధవన్ నాయర్ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ శనివారం ప్రారంభ దర్శనంలో దర్శించుకున్నారు.
News Posted: 15 May, 2009
|