కలెక్టరేట్ ముస్తాబు
చిత్తూరు : చిత్తురూలోని రెడ్డి గుంటలో అత్యాధునిక హంగులతో కలక్టెరేట్ ముస్తాబవుతోంది. పన్నెండు ఎకరాల సువిశాల మైదానంలో రూ.18.5 కోట్లతో స్టార్ తరహాలో మూడు బ్లాక్ లుగా కలెక్టరేట్ ను నిర్మించారు. కలెక్టర్, జేసీ, డిఆర్ వో ఛాంబర్లతోపాటు 200 మంది కూర్చోగల సామర్థ్యం వున్న సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ మందిరాలను నిర్మించారు. ప్రతి బ్లాక్ లోనూ కార్పొరేట్ సంస్థల్లో వుండే విధంగా ఫర్నీచర్ ను ఆధునీకరిస్తున్నారు. జిల్లా కార్యాలయాలన్నింటిని ఇక్కడికే తరలించి, జిల్లా పరిపాలనంతా కొత్త కలెక్టరేట్ నుంచే నిర్వహిస్తారు. ఈ నెలాఖరులోగా అన్ని పనులు పూర్తి చేసుకొని జూన్ తొలివారంలో నూతన కలెక్టరేట్ నుండి జిల్లా పరిపాలనకు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీహెచ్ ఎం హెచ్ ఐడీసీ సంస్థ ఇంజనీర్ల పర్యవేక్షణలో నిర్మాణం చురుగ్గా జరుగుతోంది.
News Posted: 22 May, 2009
|