నగరంలో హై అలర్ట్
తిరుపతి : దక్షిణ భారతదేశంలో ఉగ్రవాదులు ప్రవేశించినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో పుణ్యక్షేత్రాలలో ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉన్నందున పోలీసులు తిరుమల తిరుపతిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, హోటల్స్ లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా తారసపడితే పోలీసులకు తెలియజేయాలని కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అలానే హైదరాబాద్ నగరంతో పాటు, విజయవాడలో కూడా పోలీసులు ప్రత్యేక తనిఖీలు జరుపుతున్నారు.
News Posted: 4 June, 2009
|