తిరుపతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో నేడు శ్రీ గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గోవింద రాజస్వామివారు రథాన్ని అధిరోహించి తిరుమాఢ వీధులలో విహరించారు. రథముపై ఊరేగుతున్న స్వామి వారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు బారులు తీరారు. గోవింద నామస్మరణంతో మాఢవీధులు మార్మోగాయి. బ్రహ్మోత్సావల భాగంగా తిరుపతిలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.