హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఐవిఆర్ కృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వులు అందుకున్న కృష్ణారావు గురువారం ఉదయం బయలుదేరి తిరుపతి వెళుతున్నారు. ఇంతవరకూ టిటిడి ఈఓగా బాధ్యతలు నిర్వహించిన కె.వి. రమణాచారిని ప్రభుత్వం రెవెన్యూ విభాగానికి బదిలీ చేసింది.