విద్యార్థులతో చిరు సహపంక్తి భోజనం
తిరుపతి : సమాజంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే విద్యే ప్రధానమైన ఆయుధంలా ఉపయోగపడుతుందని ప్రరాజార్యం పార్టీ అధినేత, తిరుపతి ఎమ్మెల్యే కొణిదెల చిరంజీవి పేర్కొన్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన స్థానిక చెన్నారెడ్డి కాలనీలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళను సందర్శించారు. ముందుగా బాలికల వసతి గృహానికి చేరుకున్న చిరంజీవి బాలికలతో కాసేపు ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన చిరు వంటకాలు బాగున్నాయని మెచ్చుకున్నారు. విద్యార్థినులు తమకు నాలుగు నెలలుగా స్కాలర్ షిప్ డబ్బులు అందలేదని, తలగడలు లేవని, ఆదివారం వినోదం కోసం టీవీ కూడా లేదని బాలికలు చిరంజీవికి ఫిర్యాదు చేశారు. వారి సమస్యలను విన్న చిరు ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చక్కగా చదువుకోవాలని చిరు బాలికలకు సూచించారు.
News Posted: 18 June, 2009
|