మళ్లీ కాస్పరోవ్, కార్పోవ్ పోరు వాలెన్షియా (స్పెయిన్) : బల్లపై సోవియట్ సుత్తి, కొడవలితో చిన్నఅరుణ పతాకాలను అమర్చే రోజులు గతించాయి. అయితే, తమ పావులతో చెలగాటమాడుతుండడంతో గారీ కాస్పరోవ్, అనతోలీ కార్పోవ్ మధ్య స్పర్థ ఇప్పటికీ కొనసాగుతోందని సుస్పష్టమైంది. 58 ఏళ్ల కార్పోవ్ స్వల్పంగా చెమటలు కక్కాడు. కాని 46 ఏళ్ల కాస్పరోవ్ తన పావులకు ఎదురు లేకుండా చూసుకున్నాడు. ఆ రష్యన్ గ్రాండ్ మాస్టర్లు ఇద్దరూ ఎంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో ఆట పరిస్థితులపై వారి ఫిర్యాదే సూచించింది. ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న వారి పునఃపోరు మంగళవారం ప్రారంభం కావడానికి ముందు వారిద్దరూ ఆట పరిస్థితులపై ఫిర్యాదు చేశారు.
'వారు లైటింగ్ గురించి ఫిర్యాదు చేశారు... అయితే, వారు ఆడుతున్నది లెక్చర్ థియేటర్ లో కాని మెయిన్ హాల్ లో కాదు. అందువల్ల మేము చేయగలిగింది అంతగా ఏమీ లేదు' అని పాలావ్ డి లె ఆర్ట్స్ భవనంలో నిర్వాహకుడు ఒకరు పేర్కొన్నారు. 'ఇతర ప్రముఖుల వంటి వారే వారూ అని నా భావన' అని ఆయన చెప్పారు. పది మిలియన్ల మంది ఇంటర్నెట్ చదరంగం అభిమానులు వీక్షిస్తుండడంతో ఆ ప్రత్యర్థులిద్దరూ పోరుకు ఉపక్రమించారు. కార్పోవ్ తెల్ల పావులను ఎంచుకుని తన మొదటి ఎత్తు వేశాడు.
1984లో వారి మధ్య పోటీ జరిగినప్పుడు కార్పోవ్ ఎనిమిది కిలోలు బరువు తగ్గాడు. ఈ దఫా ఒక ఏడాది అంతకు మించి పోటీ సాగినా తట్టుకునేంత భారీ కాయంతో అతను కనిపించాడు. ఈ పునఃపోరు కోసం ఒక్కొక్కరూ లక్ష యూరోలు (రమారమి రూ. 70,81,919) అందుకుంటున్న ప్రత్యర్థి క్రీడాకారులు ఇద్దరూ తమను ప్రసిద్ధులుగా చేసిన మహా పోటీల వలె కాకుండా ఈ గేము కేవలం ఒక గంటలో ముగియనున్నదని తెలిసి ఊరట చెంది ఉండాలి.
Pages: 1 -2- -3- News Posted: 24 September, 2009
|