రజాక్ కు ఆఫర్ తెలీదు: మోడి న్యూఢిల్లీ : రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ టోర్నమెంట్ లో పాకిస్తానీ క్రీడాకారులు పాల్గొనడం గురించి సాగుతున్న ఊహాగానాలన్నీ అసంబద్ధమైనవని ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి గురువారం స్పష్టం చేశారు. మోడి గురువారం లండన్ నుంచి 'హిందుస్థాన్ టైమ్స్' విలేఖరితో మాట్లాడుతూ, 'ఇది పూర్తిగా అసంబద్ధమైనది' అని వ్యాఖ్యానించారు.
ఈ సంవత్సరం లీగ్ లో ఆడేందుకు ఒక ఐపిఎల్ ఫ్రాంచైజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ను సంప్రదించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు ఇజాజ్ బట్ బుధవారం లాహోర్ లో చెప్పారు. దీనిపై లలిత్ మోడి వ్యాఖ్యానిస్తూ, '(ఒక క్రీడాకారుని కొనుగోలు నిమిత్తం) ముందు డబ్బు ఉండాలి. డక్కన్ చార్జర్స్ (డిసి) వద్ద డబ్బు ఏదీ లేదు. కోలకతా నైట్ రైడర్స్ (కెకెఆర్) వద్ద డబ్బు లేదు. క్రీడాకారుని కోసం ఖాళీ కూడా ఉండాలి. అలా ఖాళీ ఏదీ లేదు. ఏ జట్టు కూడా ఆఫర్ చేయలేదు. నాకు తెలియకుండా ఏ జట్టు కూడా ఆఫర్ చేయజాలదు. నాకేమీ తెలియదు' అని వివరించారు.
'ఒక విషయం స్పష్టం చేయనివ్వండి' అని మోడి తన మాటలు కొనసాగిస్తూ, 'వేలం పాట ముగిసింది. ఖాళీలు ఏవీ లేవు. ఇప్పుడు ఎవరైనా వచ్చినా, మొత్తం సీజన్ కు గాయంతో అందుబాటులో లేని క్రీడాకారుని స్థానంలో మాత్రమే అతనిని చేర్చుకోగలరు. ఒకవేళ ఎవరైనా గాయంతో సీజన్ అంతటికీ అందుబాటులో లేకపోయారా? ఏమో నాకు తెలియదు. ఎవరూ గాయపడలేదు' అని వివరించారు.
Pages: 1 -2- -3- News Posted: 29 January, 2010
|