'టెన్నిస్' గుండెకోతలు

ముంబై : క్రిస్ ఎవర్ట్ నుంచి జస్టిన్ హెనిన్ వరకు టెన్నిస్ క్రీడాకారుల ప్రేమ చరిత్ర సానియా తరహా గుండె కోత ఉదంతాలతో నిండిపోయి ఉంది. సానియా మీర్జా తన నిశ్చితార్థం ఉంగరాన్ని ఇక ఎంత మాత్రం ధరించలేదు. దేశంలో విశిష్ట ఖ్యాతినార్జించిన క్రీడామణి సానియాకు ఇది మింగుడుపడలేని సత్యం కావచ్చు.
మన దేశ ఏకైక మహిళా గ్రాండ్ శ్లామ్ విజేత సానియాకు మహమ్మద్ సొహ్రాబ్ తో జరిగిన నిశ్చితార్థం రద్దయినట్లు ఈమధ్యే ప్రకటించారు. ఇంతకూ ఆశ్చర్యమేమిటంటే జనవరి ప్రథమార్ధంలోనే సానియా విలేఖరులతో మాట్లాడుతూ, తన వివాహానంతరం తాను టెన్నిస్ నుంచి రిటైర్ కాగలనని చెప్పడం గమనార్హం. 'ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం. పెళ్లి తరువాత ప్రాథమ్యాలు ఎన్నోరకాలుగా మారిపోతాయి. నేను టెన్నిస్ ఆడుతూ ఏడాదికి 35 వారాలు ప్రయాణం చేయవలసి వస్తుంటే ఎందుకు వివాహం చేసుకోవడం? నా భర్తతో కలసి నివసించాలని అనుకుంటున్నాను' అని సానియా పేర్కొన్నది.
సానియా, యునైటెడ్ కింగ్ డమ్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న సొహ్రాబ్ విడివిడిగా జీవితం గడపబోతున్నారు. అయితే, టెన్నిస్ ప్రపంచంలో నిశ్చిరార్థాన్ని రద్దు చేసుకున్న తొలి జంట వారు మాత్రం కాదు.
Pages: 1 -2- -3- News Posted: 1 February, 2010
|