ఏపికి దండిగా కెజి గ్యాస్
ముంబైః కెజి గ్యాస్ విడుదలకు త్వరలో రంగం సిద్ధం కానుంది. గ్యాస్ కేటాయింపు విషయంపై చర్చించేందుకు పెట్రోలియం, విద్యుత్ మంత్రిత్వ శాఖల అధికారులకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ ఐఎల్ )సంస్థకు మద్య ఈ వారాంతంలో ఢిల్లీ వద్ద చర్చలు జరుగనున్నాయి.పలు కంపెనీలకు అందించే క్రిష్ణ గోదావరి బేసిన్ (కెజి బేసిన్) గ్యాస్ కేటాయింపులపై సమావేశం ఈ వారాంతాన జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కంపెనీలకు అధిక ప్రాధాన్యమిస్తామని పెట్రోలియం శాఖ కార్యదర్శి ఆర్ ఎస్ పాండే తెలిపారు.
గ్యాస్ వినియోగ విధానం ప్రకారం ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు ప్రథమ ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను పరిపర్తిచేసుకునేందుకు కెజి బేసిన్ గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్ర సంస్థలకు అధిక ప్రాధాన్యతనివ్వ వలసిందిగా పెట్రోలియం, సహజవాయువు మంత్రిశాఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. 'కెజి బేసిన్ గ్యాస్ లో అధిక శాతం రాష్ట్రానికి చెందిన విద్యత్ కంపెనీలకుకేటాయించాలని ప్రభుత్వం కోరింది. మార్చ్-ఏప్రిల్ మధ్యకాలంలో ఆర్ ఐఎల్ సంస్థ ఉత్పత్తి చేసిన గ్యాస్ పరిమాణంలో సగం అంటే 9మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే (ఎమ్ సిఎమ్ డి)గ్యాస్ ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది'అని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపి జెన్కో) అధికారి తెలిపారు.
Pages: 1 -2- News Posted: 10 February, 2009
|