రెడీమేడ్ మహా చౌక
ముంబైః రెడీమేడ్ బట్టల వ్యాపారం ఘోరంగా దెబ్బతింది.అమ్మకాలు ఘోరంగా పడిపోవడంతో రెడీమేడ్ షాపులు కొనుగోలు ధర కంటే తగ్గించి నష్టాలకు అమ్మకాలు సాగిస్తున్నాయి.మగవాళ్ల రెడిమేడ్ జాకెట్లు, పుల్ ఓవర్స్, స్వెట్ షర్టులు, ట్రాక్ సూట్స్ వగైరాలపై ఢిల్లీకి చెందిన కోటన్ రిటైల్ చైన్ 80 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. అదే సమయంలో డెనిమ్ ఆడవాళ్ల, పిల్లల రెడీమేడ్స్ పై 70 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది.కౌటాన్స్ రిటైల్ చైన్ ఒక్కటే కాదు రెడీమేడ్ షాపుల పరిస్ధితి సర్వత్రా ఇలానే ఉంది.
బహుళ బ్రాండ్ల రిటైల్ సంస్థ 'గ్రాబ్ స్టోర్'సీజన్ చివర్లో 69 శాతం డిసౌంట్ ను ప్రకటించింది. ఆర్పిజి రిటైల్ చైన్ 'స్పెన్సర్స్', వెల్ స్పన్ గ్రూప్ గృహోపకరణాల రిటైల్ సంస్థ 'వెల్ హోమ్'లు కూడా సీజన్ చివర్లో 70 శాతం డిస్కౌంట్లను ప్రకటించాయి. షాపుల్లో పేరుకుపోతున్న నిల్వలను వదిలించుకునేందుకు రెడీమేడ్ షాపులు, బట్టల షాపుల యాజమాన్యాలు 80 శాతం దాకా డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. వర్కింగ్ కేపిటల్ కోసం భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ప్రతిఏడాది ఫిబ్రవరి చివరినాటికల్లా బిజినెస్ సీజన్ ముగుస్తుంది. ఈ ఏడాది గతంలో కంటే ఎక్కువగాను, ముందుగాను డిస్కౌంట్లను ప్రకటించడమే విశేషం. ప్రతి ఐటమ్ పైన దాదాపు 20-25 శాతం డిస్కోంట్ ను ఈ రిటైల్స్ సంస్థలు ప్రకటించాయి. అదే సమయంలో సీజన్ ముగిసేందుకు నాలుగు వారాల ముందుగానే ఈ డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తున్నాయి.
Pages: 1 -2- News Posted: 12 February, 2009
|