సత్యం అధికారులకు ఉద్వాసన
హైదరాబాద్: 'బరువును తగ్గించుకుని యంత్రాగాన్ని పనిలో పెట్టండి, మంచి ఫలితాలొస్తాయి' అన్న చైనా సామెతను సత్యం కంప్యూటర్స్ సంస్థ అక్షరాల పాటిస్తున్నట్లనిపిస్తోంది. కంపెనీ అమ్మకానికి ముందస్తుగా యంత్రాంగాన్ని సరిచేసే చర్యలకు సత్యం బోర్డు శ్రీకారం చుట్టింది. పూర్దిగా కుప్పకూలిన కంపెనీని పట్టాలెక్కించేందుకు అవరోధంగా ఉన్న కొంతమంది ఉన్నతాధికారలను బాధ్యతలను తప్పించేందుకు బోర్డు నిర్ణయించుకుంది. కంపెనీకి చెందిన పలు వర్టికల్స్ కు బాధ్యత వహిస్తున్న సీనియర్ మేనేజర్ల కార్యకలాపాన్ని సమీక్షించి దాదాపు 6-8 మంది ఉన్నతాధికారులను బోర్డు తొలగించే అవకాశముంది.
సీనియర్ అధికారులను తొలగించే ప్రక్రియలో మొదటగా పైనాన్షయల్ సర్వీసెస్ వర్టికల్ కు బాధ్యత వహిస్తున్న వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ ను తన బాధ్యతల నుండి తప్పుకోవలసిందిగా బోర్డు సోమవారం నాడు కోరింది. ఆయనతో సంప్రదించిన అనంతరం తన బాధ్యతల నుండి తప్పుకోవాలని బోర్డు కోరినట్లు తెలుస్తోంది. ఇదే వరుసలో దాదాపు ఆరుగురు సీనియర్ అధికారులతో బోర్డు సంప్రదింపులు ప్రారంభించింది. ఒక వారంలోకా వారిని కూడా రాజీనామా చేయాలని బోర్డు కోరే అవకాముంది. 'ఖాతాదారులతో సంప్రదించి నిలబెట్టుకోవడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. అత్యధిక జీతాలను తీసుకునే ఉన్నత స్థాయి బాస్ లపై కంపెనీకి ఆసక్తి లేదు. కంపెనీ పునరుజ్జీవనానికి ముందుకొచ్చి పనిచేసేవారిపై కంపెనీ ఆసక్తిని కనబరుస్తోంది'ఆని కంపెనీ విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ ఉన్నతాధికారులను తొలగించడంతో పాటు పలు వర్టికల్స్ పని తీరును పునర్నిర్వచించడం జరుగుతుంది.
Pages: 1 -2- News Posted: 17 February, 2009
|