శామ్ సంగ్ సోలార్ ఫోన్
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ హామీకి కట్టుబడి సరికొత్తగా సోలార్ మొబైల్ ఫోన్ కు శామ్ సంగ్ రూపకల్పన చేసింది. సౌర శక్తితో నడిచే 'బ్లూ ఎర్త్' మొబైల్ ఫోన్ ను ఫిబ్రవరి 16-19 వరకు బార్సిలోనా- 2009 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో శామ్ సంగ్ ప్రదర్శించింది. శామ్ సంగ్ పర్యావరణ పరిరక్షణ దృక్కోణానికి తార్కాణంగా ఈ సోలార్ ఫోన్ నిలుస్తుంది. యూరోపియన్ కమీషన్ తో స్వచ్ఛందగా చేసుకున్న ఒప్పందం ఐపిపి (ఇంటగ్రేటెడ్ ప్రాడక్ట్ పాలసి) కి కట్టుబడి బ్లూ ఎర్త సోలార్ ఫోన్ ను శామ్ సంగ్ తయారు చేసింది. నూటికి నూరు పాళ్లు పర్యావరణ స్పృహతో రూపొందిన ఫోన్ గా శామ్ సంగ్ కంపెనీ ప్రకటించింది.
'ది బ్లూ ఎర్త్ డ్రీమ్: ఎకో లివింగ్ విత్ శామ్ సంగ్ మొబైల్' అన్న నినాదంతో ఈ సోలార్ ఫోన్ ను శామ్ సంగ్ విడుదల చేసింది. చదునుగా, మెరుసే తీరైన రత్నంలా బ్లూ ఎర్త్ రూపొందింది. సౌరశక్తి తో నడిచే తొలి మొబైల్ ఫోన్ ఇదే. ఈ ఫొన్ కు వెనుక వైపున అమర్చిన సోలార్ ప్యానెల్స్ నుండి తగినంత విద్యుత్ శక్తి ఫోన్ కు అందుతుంది. ఎప్పుడైన, ఎక్కడైనా ఈ ఫోన్ ను వినియోగించే అవకాశముంటుంది. ఈ బ్లూ ఎర్త్ మొబైల్ ను రిసైకిల్ చేసిన ప్లాస్టిక్ పిసిఎమ్ నుండి తయారు చేసారు. వాటర్ బాటిల్స్ లాంటి ప్లాస్టిక్ వస్తువులను రిసైకిల్ చేసిన పిసిఎమ్ నుండి ఈ ఫోన్లను తయారు చేశారు. దాంతో ఈ ఫోన్ల తయారీలో ఇంధన వినియోగాన్ని, కార్బన్ డై ఆక్సైడ్ విడుదల ప్రమాదాన్ని ఆదా చేయడం జరిగింది.
Pages: 1 -2- News Posted: 17 February, 2009
|