నాగార్జునకు రిలయన్స్ గ్యాస్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ సంస్థకు మొట్టమొదటి సహజ వాయువు కన్ సైన్మెంట్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)అమ్మనుంది. కాకినాడ వద్ద కృష్ణ-గోదావరి బేసిన్ లోని డి6 బ్లాక్ లో ఉత్పతతి అవుతున్న సహజ వాయువు మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్ (ఎమ్ బిటి యు) గ్యాస్ ను 4.2 అమెరికన్ డాలర్లకు అయిదేళ్లపాటు నాగార్జునకు రిలయన్స్ సంస్థ అమ్మేందుకు ఒప్పందం కుదిరింది. ఈ గ్యాస్ రవాణాకు, పన్నులకు గాను నాగార్జున కంపెనీ చెల్లించవలసి ఉంటుంది. అంతా కలిస్తే ఒక ఎమ్బిటియు గ్యాస్ కు దాదాపు 6.5 డాలర్లు ఖర్చుకానుంది.
రోజుకు 1.55 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ మీటర్ల (ఎమ్ఎమ్ఎస్ సిఎమ్ డి) గ్యాస్ ను ఎన్ఎఫ్ సిఎల్ కు సరఫరా చేయవలసి ఉంటుంది. డి 6 బ్లాక్ లో తొలుత 10 ఎమ్ఎమ్ఎస్ సిఎమ్ డిల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అంచనా. అందువల్ల ఎన్ఎఫ్ సిఎల్ సంస్థకు గ్యాస్ సరఫరా చేసే పరిమాణం ఇంతవరకు తేలలేదని పెట్రోలియమ్ శాఖ మంత్రి మురళి దేవర బుధవారంనాడు తెలిపారు. డి 6బ్లాక్ లో గ్యాస్ ఉత్పత్తి ఛఏర్పిల్ నుండి ప్రారంభంకానుంది. రవాణా ఖర్చుల విషయమై పెట్రోలియమ్ అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పిఎన్ జిఆర్ బి) అనుమతి కోసం ఆర్ఐఎల్ ఎదురుచూస్తోంది. ఎన్ఎఫ్ సిఎల్ షేర్లు 16,30 రూపాయలకు, ఆర్ఐఎల్ షేర్లు 2.14 శాతం పెరిగి 1,294.75 రూపాయల వద్ద నిలిచింది.
కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారం ఏడాదికి 12 లక్షల టన్నుల సామర్ధ్యం కలది. దిగుమతులతో కలుపుకుంటే నాగార్జు కంపెనీ ఏడాదికి దాదాపు 1.9 మిలియన్ టన్నుల యూరియాని మార్కెటింగ్ చేస్తోంది. నాఫ్తా కంటే చౌకగా గ్యాస్ లభిస్తే ఎరువుల ధరలు మరింతగా తగ్గిపోతాయి. ధర తగ్గింపు కంపెనీకి గ్యాస్ సరఫరా చేసే పరిమాణంపై ఆధారపడి ఉంటుందని ఆ నాగార్జున కంపెనీ అధికారి తెలిపారు. ఆంధ్రప్రదేశ పవర్ ప్లాంట్లకు, ఎరువుల కర్మాగారాలకు గ్యాస్ ను సరఫరా చేయడంపై ఆర్ఐఎల్ అధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. పర్యవసానంగా ఎరువులకు అందించే ప్రభుత్వ సబ్సిడీ భారం తగ్గించుకునే ఒప్పందంపై ప్రభుత్వం ఆర్ ఐఎల్ గ్యాస్ ను సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో 2009-10 లో సబ్సిడీగా అందివ్వాల్సిన 16,516 కోట్ల రూపాయలకు గాను మధ్యంతర బడ్జెట్ లో కేంద్రం 8,580 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది.
Pages: 1 -2- News Posted: 19 February, 2009
|