కుంగిన బిలియనీర్లు
న్యూయార్క్: ఫోర్స్బ్ ప్రపంచ సంపన్నుల జాబితా బుధవారంనాడు విడుదలయ్యింది. ఆ జాబితాలో మైక్రోసాఫ్ట అధినేత బిల్ గేట్స మరలా ఆగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభంలో కూడా ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో అమెరికా దిగ్జాలే అత్యధిక స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది ప్రపంచ సంపన్నుల జాబితా బక్కచిక్కింది. 2008లో 1,125 మంది బిలియనీర్లుంటే వాళ్లు ఈ ఏడాది 793 మందికి తరగిపోయారు. ప్రపంచ సంపన్నుల మొత్తం ఆస్తుల విలువ 4.4 ట్రిలియన్ డాలర్ల నుండి 2.4 ట్రిలియన్ డాలర్లకు తరగిపోయిందని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.
ప్రపంచ సంపన్నుల జాబితాలో 40 బిలియన్ డాలర్ల ఆస్తుల విలువ కలిగి ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. గత 12 నెలల్లో ఆయన ఆస్తుల విలువ దాదాపు 18 బిలియన్ డాలర్లు తరగిపోయాయి. కొంత కాలంగా సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న వారెన్ బఫెట్ ఆస్తుల విలువ తరగిపోవడంతో ఆయన రెండవ స్థానంలోకి వచ్చి చేరారు. బెర్క్ షైర్ హేథవే షేర్లు 25 బిలియన్ డాలర్లు కరగిపోవడంతో ఆయన ఆస్తుల విలువ 37 బిలియన్ డాలర్లకు చేరింది. 25 బిలియన్ డాలర్లను నష్టపోయిన మెక్సికన్ టలికామ్ దిగ్గజం కార్లోస్ స్లిమ్ 35 బిలియన్ డాలర్ల ఆస్తులతో మూడవ స్థానంలో నిలిచారు. అమెరికా బిలియనీర్ల ఎదుగుదలతో భారత, రష్యా, టర్కీ బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
సంపన్నుల జాబితాలోని 20 స్థానాల్లో 10 స్థానాలు అమెరికా బిలియనీర్లు సాధించారు. ప్రపంచ బిలియనీర్ల అధికంగా ఉండే మాస్కో నగరాన్ని న్యూయార్క్ నగరం అధిగమించింది. మాస్కో నగరంలో ఉన్న 55 మంది బిలియనీర్లు 27 మంది బిలియనీర్ల స్థాయికి పడిపోయింది. లండన్ లో 28 బిలియనీర్లతో రెండవ స్థానంలో చేరింది. సరకుల ధరలతో ఆస్తుల విలువ ముడిపడిన రష్యా రెండింటిలో మూడు వంతుల మంది సంపన్నులను నష్ట పోయింది. రష్యాలో ఉన్న 87 మంది బిలియనీర్లు 32 మందిగా కుంగిపోయారు. రష్యా ధనస్వామ్యులు చాలా కాలంగా అపారమైన సంపదలు కూడబెట్టారు. అయితే వారిలో ఎవరూ కూడా 20 మంది అత్యున్నత సంపన్నుల జాబితాలో లేరు. 2008 జాబితాలో రష్యా బిలియనీర్లు దాదాపు నలుగురున్నారు. భారత దేశంలో బిలియనీర్ల సంఖ్య సగానికి తగ్గిపోయింది. 53 మంది బిలియనీర్లు సంఖ్య 24 మందికి పడిపోయింది.
Pages: 1 -2- News Posted: 12 March, 2009
|