బోర్డు తిప్పిన మొబైల్ వరల్డ్
(ఎస్సెస్వీ)
మయసభ -మహాభారతం చదివిన వారికి మయసభ గుర్తుండే ఉంటుంది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్టుగా భ్రమలో పడేయడం మయసభ ప్రత్యేకత. అప్పటి మయసభనే ఇప్పటి ఆధునిక పరిభాషలో చెప్పాలంటే 'వర్చువల్ రియాలిటీ'. ఇదీ భ్రమే-లేనిది ఉన్నట్లుగా భ్రమ కల్పించడం. అప్పట్లో మయడిలాంటి మహాశిల్పులు రాజుల మెప్పుకోసం - తమ శిల్ప చాతుర్యంతో - వర్చువల్ రియాల్టీ- భ్రమలు కల్పించే కట్టడాలను సృష్టిస్తే నేటి ప్రపంచంలో ఆధునిక మాయగాళ్లు తమ వాక్చాతుర్యంతో ఔత్సాహికుల కళ్ల ముందు లక్షల, కోట్ల రూపాయల నోట్ల కట్టల కుప్పలను చూపించి ఆ తర్వాత అందమైన కుచ్చుటోపి వేసి బిఛాణా ఎత్తేయడం పరిపాటైంది.
ఆ కోవకే చెందిన మరో కేసు మంగళవారం రోజు వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి హైదరాబాద్ లో బేగంపేట సమీపంలో 'వైఎమ్ సి మొబైల్ వరల్డ్' పేరిట గత ఆగష్టులో అట్టహాసంగా ఒక సంస్థను స్థాపించారు. సాధారణ మొబైల్ ఫోన్ మొదలుకొని ఖరీదైన యాపిల్ ఫోన్ దాకా అన్ని రకాల మొబైల పో్న్ లను సంస్థ సేల్ చేస్తుంది. ఒక్క సెల్ ఫోన్ అమ్మకాలే కాదు. అన్ని రకాల మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్లులు, ల్యాండ్ ఫోన్ బిల్లలులు, ఇంటర్నెట్ బిల్లులు, డిటిహెచ్ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు స్వీకరించడం, ఇంటర్నెట్, డిటిహెచ్ కనెక్షన్లు, ఫోన్ రిపెయిర్ ల వంటి అన్ని రకాల సర్వీసులను ఈ సంస్థ తన ఔట్ లెట్లలో అందిస్తుందన్న రంగుల ప్రపంచాన్ని జనం కళ్ల ముందు సృష్టించింది.
Pages: 1 -2- -3- News Posted: 18 March, 2009
|