త్వరలో ఎల్ఐసి క్రెడిట్ కార్డ్
న్యూఢిల్లీ: ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్ ష్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) కొత్తగా క్రెడిట్ కార్డుల రంగంలోకి ప్రవేశించింది. 2009 మార్చి 31 నాడు క్రెడిట్ కార్డు వ్యవస్థను ఎల్ఐసి ప్రవేశపెట్టనుందని ఎల్ఐసి చైర్మన్ టిఎస్ విజయన్ తెలిపారు. క్రెడిట్ కార్డుల విషయంగా కార్పొరేషన్ బ్యాంక్ తో ఎల్ఐసి ఒప్పదం కుదుర్చుకుంది. తెల్లటి లేబుల్ తో ఉన్న క్రెడిట్ కార్డులను ఎల్ఐసి తరఫున బ్యాంకు విడుదల చేస్తుంది.అయితే క్రెడిట్ కార్డ్ వ్యవస్థు ప్రస్తుతం బాగా దెబ్బతినిపోయినప్పటకీ తనకు సొంతంగా వినియోగదారులున్నారని ఎల్ఐసి విశ్వాసం వ్యక్తం చేసిందని కార్పొరేషన్ బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జెఎమ్ గార్గ్ తెలిపారు.
'ఎఐసి ఒక పెద్ద పేరు ప్రఖ్యాతలున్న సంస్థ. ఎల్ఐసి పాలసీదారులు కూడా కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ పరిస్థితి సరికొత్త వ్యాపారం ప్రారంభించేందుకు మాకు ఉపకరించగలదు' అని గార్గ్ తెలిపారు. ప్రయాగాత్మకంగా కొన్ని కార్డులను మాత్రమే ప్రారంభంలో విడుదల చేస్తున్నారు. మార్కెట్ పరిస్థితి అంచనా వేసిన తర్వాత వినియోగదారలకు ఈ అవకాశం కల్పిస్తారని గార్గ్ తెలిపారు. సాధారణ క్రెడిట్ కార్డుల వలె ఈ కార్డులు కూడా ఉన్నప్పటికీ, క్రెడిట్, క్యాష్ పరిమితుల్లో తేడా ఉంటుంది.
ఎల్ఐసి సంస్థలో 22 కోట్ల మంది పాలసీదారులున్నారని ఆ సంస్థ అధికారి తెలిపారు. మా అవసరం కొద్దీ మేము ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాము. సెక్యూరిటీ లేని రుణాలను ఇవ్వడం, పాలసీ ప్రీమియం లను చెల్లించే సదుపాయాన్ని ఈ క్రెడిట్ కార్డల ద్వారా అందించనుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ కెసి చక్రవర్తి తెలిపారు. ఎల్ఐసి సంస్థ బ్యాంక్ అష్యూరెన్స్ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే క్రెడిట్ కార్డు మార్కెట్ లోకి ఎల్ఐసి సంస్థ ప్రవేశం ప్రభావితం చేసే విషయంపై ఆయన వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఈ మధ్య కాలంలో తీవ్రంగా దెబ్బతింది. బకాయిదారులు డబ్బు చెల్లించకపోవడం, వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం లాంటి పలు సమస్యల్ని క్రెడిట్ కార్డు వ్యవస్థ ఎదుర్కుంటోంది.
Pages: 1 -2- News Posted: 19 March, 2009
|