తగ్గిన క్రెడిట్ కార్డుల జోరు
న్యూఢిల్లీ: ఆర్ధిక సంక్షోభం కారణంగా ఏర్పడిన రుణ కొరత ప్లాస్టిక్ క్యాష్ పై (క్రెడిట్ కార్డులు వగైరా) ప్రతికూల ప్రభావమేస్తోంది. దాంతో ఉన్నట్లుండి మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ కావచ్చు, లేదా క్రెడిట్ లిమిట్ తగ్గిపోవచ్చు. అందుకు ఆందోళన చెందొద్దు. గత క్రెడిట్ కార్డు బిల్ చెల్లింపు జరిగిందా లేదా చూసుకోండి. ఈ గడ్డు పరిస్థితుల్లో రుణ పరిమితిని తగ్గించాలని మీ బ్యాంక్ నిర్ణయించి ఉండొచ్చు. ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకోకూడదు. ఇలాంటి చర్యలు మిమ్నల్ని మీ బ్యాంకును ఉపేక్ష (డిఫాల్ట్) బారి నుండి రక్షిస్తుంది.
ఈ ఆర్ధిక సంవత్సరంలో బకాయిలు చెల్లించని వారి శాతం బాగా పెరిగిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. 2007-08 సకాలంలో క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించని వారు 10 శాతం మంది ఉన్నట్లు తెలుస్తోంది. 2007-08 ఆర్ధిక మాంద్యం కారణంగా ఈ వీరి సంఖ్య 17 శాతం చొప్పున పెరిగినట్లు క్రెడిట్ కార్డ్ వ్యాపార వర్గాల అంచనాలు తెలయజేస్తున్నాయి. ఒక క్రెడిట్ కార్డు హోల్డర్ పై ఆంక్షలు పెట్టేముందు ఆ వినియోగదారునికి సంబంధించిన పలు అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. మీ జీతం ఖాతా ఆ బ్యాంకులో ఉన్నట్లయితే మీరు ఉద్యోగంలో కొనసాగుతున్న విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. మీ చెల్లింపుల ధరణిని బ్యాంక్ పరిశీలిస్తుంది. గతంలో బ్యాంకులు క్రెడిట్ హోల్డర్ల రుణ పరిమితులను అడగకుండానే పెంచేవి. అయితే నేడు నెలకొన్న ఆర్దిక గడ్డు పరిస్థుతుల్లో క్రెడిట్ కార్డులపై రుణ పరిమితులను బ్యాంకులు తగ్గించి వేస్తున్నాయి. ఆ విషయాన్ని వినియోగదారులకు తెలియజేస్తున్నాయి. మీ క్రెడిట్ కార్డు ఖర్చులో అకస్మాత్తుగా తేడా వచ్చినట్లయితే బ్యాంకులో అందుకు సంబంధించిన హెచ్చరికలు వస్తాయి. అలాంటి సందర్భంలో మీ బ్యాంక్ మీ రుణ పరిమితిపై రహస్యంగా కోత విధిస్తుంది.
Pages: 1 -2- News Posted: 20 March, 2009
|