క్రెడిట్ కార్డు ఇక్కట్లు
ముంబై : క్రెడిట్ కార్డు విస్ఫోటం కోసం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు నిరీక్షిస్తున్నాయి. కాని ఇండియాలో క్రెడిట్ కార్డు జారీ చేస్తున్న బ్యాంకులు రుణాల బకాయిల వసూలుకు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. చాలా కాలంగా వినియోగంలో లేని క్రెడిట్ కార్డులను బ్యాంకులు రద్దు చేస్తుండడమే కాకుండా భవిష్యత్ చెల్లింపుల కోసం ఆ కార్డుల లక్ష్యాన్నే మారుస్తున్నాయి.
పూర్వపు బిల్లును చెల్లించకపోతే కార్డులను వాడుకోవడానికి ఎంపిక చేసిన కొందరు కార్డు హోల్డర్లను సిటీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు అనుమతించడం లేదు. ముంబైకి చెందిన అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ చంద్రేష్ రావు (పేరు మార్చడమైనది) తన ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా ఒక చెల్లింపు జరపడానికి ప్రయత్నించారు. కాని సేల్స్ పర్సన్ 'సార్! కార్డు చెల్లదు' అని ఆయనతో చెప్పారు. ఆయన కాల్ సెంటర్ ను సంప్రతించినప్పుడు అంతకు ముందు నెల బిల్లును పూర్తిగా చెల్లించిన తరువాతే కార్డును ఏక్టివేట్ చేస్తామని ఆయనకు స్పష్టం చేశారు.
30 నెలలుగా సిటీబ్యాంక్ కార్డు ఉన్న 26 సంవత్సరాల దేవాంశ్ శర్మ మొత్తం బాకీ సొమ్ము రూ. 2500లో కనీస మొత్తం 5 శాతాన్ని 2009 ఫిబ్రవరి 25న చెల్లించారు. కాని మొత్తం డబ్బు చెల్లించనందున తరువాత మూడు రోజుల పాటు ఆయనకు క్రెడిట్ కార్డు లావాదేవీలను అనుమతించలేదు. 'నేను గతంలో నా బిల్లులను ఎప్పుడూ పూర్తిగా చెల్లించేవాడిని' అని శర్మ చెప్పారు.
ప్రస్తుత కార్డు హోల్డర్లకు కూడా కార్డు వాడకం రానురాను కష్టం అవుతోంది. ఐసిఐసిఐ బ్యాంకు తన కార్డు హోల్డర్లకు ఇటీవల ఒక లేఖ పంపింది. 'క్రెడిట్ కార్డు వినియోగదారుడుగా మీరు ఎటిఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవడానికి మీ రుణ పరిమితిలో కొంత భాగాన్ని ఉపయోగించుకోవచ్చు. మా ప్రామాణిక పద్ధతులలో భాగంగా, మేము నగదు విత్ డ్రాయల్ సౌకర్యాలను సమీక్షిస్తుంటాం. ఆ సమీక్ష ఆధారంగా, ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు కస్టమర్లు అందరికీ నగదు పరిమితులను తగ్గిస్తున్నాం. నగదు పరిమితులను తగ్గించినప్పటికీ, మొత్తం మీద మీ రుణ పరిమితిని మార్చడం లేదనే సంగతి గమనించండి' అని బ్యాంకు ఆ లేఖలో పేర్కొన్నది.
Pages: 1 -2- News Posted: 27 April, 2009
|