పసిడి ధరలు పైపైకి
హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరో సారి దూసుకుపోతున్నాయి. దేశీయ మార్కెట్లోనూ రూపాయి మారకంతో పోల్చుకుంటే డాలర్ విలువ బలహీనపడడంతో పసిడి ధరలూ భగ్గున మండు తున్నాయి. శుక్రవారం రిటైల్ మార్కెట్లో పది గ్రాముల బంగారం(24 క్యారెట్స్) ధర రూ.14,700లు పలికింది. ఈ నెలాఖరకు ఇది రూ.15వేలకు చేరుతుం దని మార్కెట్ వర్గాల అంచనా. అదే విధంగా చమురు ధరలు కూడా బంగారంతో పోటీపడి మరీ పరుగులెడుతున్నాయి.
శుక్రవారం బ్యారెల్ 60 డాలర్లకుపైనే పలికింది. ఈ నెలాఖరకు ఇది 70 డాలర్లకుపైనే దూసుకుపోతుం దని చమురు నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో మాంద్యం చాపకింద నీరులా విస్తరించడంతో అన్ని వ్యాపారాలు చతికిలపడ్డాయి. తాజాగా మారోసారి చమురు మంటలు తెరపైకి రావడంతో ఇటు పాలక వర్గాలు, ఇటు పారిశ్రామిక వర్గాల గుండెళ్లో రైళ్లు పరుగెలెడుతున్నాయి. దేశీయంగాను ద్రవ్యోల్బణం క్రమేణ అదుపు తప్పుతున్నది. దీంతో కొత్త ప్రభుత్వాలకు ఇటు చమురు, ధరలను, అటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం ప్రధాన సవాళ్ళుగా నిలవనున్నాయి.
పసిడి ధరలు రోజురోజుకీ పెరగడంతో సామాన్యుడి వీటి చాయలకే రావడంలేదని, ఇప్పటికే తులం బంగారం రూ.14,700లకు చేరుకుందని రిటైల్ గోల్డ్ వ్యాపారులు గగ్గోలెడుతున్నారు. గత సంవత్సరమే బంగారం అల్ టైమ్ రికార్డ్ తులం రూ.15,780లకు దూసుకుపోయిందని, మళ్ళీ అదే ఊపును పసిడి ధరలు ప్రదర్శిస్తే మార్కెట్లో మరింత సంక్షోభం చోటుచేసుకుం టుందని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పసిడి వ్యాపారి చెప్పారు. బంగారం ధరలు పెరుగుతున్న కొద్డీ వినియోగదారులు రోల్‌గోల్డ్ జ్యూయలరీస్‌పై దృష్టి సారి స్తున్నారని, గత సంవత్సరంతో పోల్చుకుంటే బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Pages: 1 -2- News Posted: 23 May, 2009
|