ఐఫోన్ల రేట్లు తగ్గవు
ముంబై : అమెరికన్ మార్కెట్ లో తన ఎంట్రీ లెవెల్ ఐఫోన్ (8 జిబి వర్షన్) ధరలను తగ్గించాలన్న ఏపిల్ నిర్ణయం ఇప్పట్లో ఇండియాకు వర్తించే అవకాశం కనిపించడం లేదు. దేశంలో హాండ్ సెట్ల ప్రధాన పంపిణీదారులైన రెండు టెలికామ్ ఆపరేటర్ సంస్థలు భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ - ఎస్సార్ నుంచి తమకు ఎటువంటి సమాచారమూ అందలేదని ప్రముఖ హాండ్ సెట్ రైటెయిల్ సంస్థలు తెలియజేశాయి.
ధరల తగ్గింపు గురించి ఏపిల్ సంస్థ నుంచి తమకు ఎటువంటి వర్తమానమూ అందలేదని భారతీ ఎయిర్ టెల్ సంస్థ అధికారులు చెప్పారు. కాగా, వోడాఫోన్ - ఎస్సార్ సంస్థ అధికారులు దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. 'మేము రెండు మోడల్స్ 8 జిబి, 16 జిబి హాండ్ సెట్లను పాత ధరలకే విక్రయిస్తున్నాం' అని ఢిల్లీకి చెందిన హాండ్ సెట్ రీటెయిలర్ టఫీస్ టెలికామ్ సంస్థకు చెందిన సచిన్ సేఠ్ ధ్రువీకరించారు. చెన్నై, ముంబై నగరాలలో నెలకు సుమారు 50 నుంచి 100 వరకు ఐఫోన్లను విక్రయిస్తుండే ఇతర రీటెయిలర్లు పలువురు కూడా ఇదే సమాధానం ఇచ్చారు.
అంటే, భారతీయ వినియోగదారులు ఈ ఉన్నత స్థాయి సాధనానికి అధిక ధర చెల్లిస్తూనే ఉంటారన్న మాట. వాస్తవానికి యుఎస్ లో లభించే ధరకు ఆరింతలు రేటు పెట్టవలసి వస్తున్నది.
మంగళవారం ఏపిల్ సంస్థ తన ఎంట్రీ లెవెల్ ఐఫోన్ ధరలను యుఎస్ మార్కెట్ లో పూర్వరు 199 డాలర్ల నుంచి 99 డాలర్లకు (సుమారు రూ. 5000కు) తగ్గించింది. ఇండియాలో ఈ మోడల్ ధర రూ. 660 డాలర్లు (రూ. 31 వేలు) గా ఉన్నది. 16 జిబి ఐఫోన్ ధర అమెరికాలో 299 డాలర్లు ఉండగా ఇండియాలో 766 డాలర్లు (రూ. 36 వేలు)గా ఉన్నది.
Pages: 1 -2- News Posted: 12 June, 2009
|