మరో 80 `మోర్' స్టోర్స్
ముంబయి : గడచిన ఆర్థిక సంవత్సరంలో 110 శాతం వృద్ధిని సాధించి మంచి ఊపులో ఉన్న ఆదిత్య బిర్లా రిటైల్ చెయిన్ ఈ ఏడాది కొత్తగా 80 `మోర్...' స్టోర్స్ ను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇదే సమయంలో 10-20 ఔవుట్ లెట్లను క్లీనప్ కార్యకలాపాల్లో భాగంగా మూసివేసే అవకాశం ఉంది. `మా అవులెట్ల సంఖ్యను 720-230 వరకు పెంచాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా కొత్తగా 80 స్టోర్స్ ప్రారంభించాలని అనుకుంటున్నాం. పాత వాటిలో 10 నుంచి 20 స్టోర్స్ మూసివేస్తాం. అందువల్ల మొత్తం మీద ఈ ఏడాది అదనంగా 60-70 అవుట్ లెట్లు కలుస్తాయని ఆదిత్య బిర్లా రిటైల్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థామస్ వర్గీస్ తెలిపారు.
ప్రస్తుతం మైసూరు, బరోడాలలో కంపెనీ రెండు హైపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. అదే తరహాలో మార్చి నాటికి ఆరు నుంచి ఎనిమిది హైపర్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. `ఈ ఆర్థిక సంవత్సరంలో హైపర్ మార్కెట్లపై దృష్టిని కేంద్రీకరిస్తామని, ఆరు నుంచి ఎనిమిది హైపర్ మార్కెట్లు ప్రారంభించాలని అనుకుంటున్నామని' వర్గీస్ తెలిపారు. ఈ ఏడాది 1600-1700 కోట్ల రూపాయల అమ్మకం టర్నోవర్ సాధించాలని అనుకుంటున్నామని, ఇది క్రితం సంవత్సరం కన్నా 45 శాతం ఎక్కువ అని తెలిపారు. గత సంవత్సరం 110 శాతం వృద్ధిని సాధించాము. ఈ ఏడాది అంత సాధ్యం కాకపోవచ్చు. అయితే 40-45 శాతం వృద్ధిని సాధించవచ్చు అని ఆయన అన్నారు.
Pages: 1 -2- News Posted: 22 June, 2009
|