ప్రత్యక్ష పన్నుల ప్రక్షాళన
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల వసూలు విధానాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేయడానికి నడుంబిగించింది. దీని వలన ఆదాయపన్ను చెల్లింపు దారులకు ఊరట లభిస్తున్నా హౌసింగ్, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ రూపంలో ఇప్పటి వరకు అమలులో ఉన్న రాయితీలు పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. పన్నుల వ్యవస్థను సమూలంగా సంస్కరించేందుకు ప్రభుత్వం తలపెట్టింది. ఈ చర్యలో భాగంగా కేంద్రప్రభుత్వం బుధవారం ప్రత్యక్ష పన్నుల కొత్త కోడ్‌ను విడుదల చేసింది. అన్నీ సజావుగా సాగితే 2011 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త పన్నుల విధానం అమలులోనికి వస్తుంది.
‘ఈ విధానం వల్ల పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత మెరుగ్గా అమలు చేయవచ్చనుకుంటున్నాం. వివాదాలకు అంతగా ఆస్కారం ఉండదు. సులభతరమైన ఈ వ్యవస్థ లాభాపేక్షలేని సంస్థలకు, పొదు పు పథకాలకు, దీర్ఘకాలిక సెక్యూరిటీస్ ట్రేడింగ్‌లో కేపిటల్ గెయిన్స్ కు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని ప్రణబ్ ముఖర్జీ వివరించారు. ప్రస్తుత హోంమంత్రి పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ కోడ్ రూపకల్పనకు చొరవ తీసుకున్నారు. ‘1961 ఆదాయపు ప న్ను చట్టంతో దీన్ని ఏమాత్రం పోల్చడం తగదు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంతో దీన్ని పోల్చడం అర్థరహితమే అవుతుంది. ప్రస్తుత పన్ను చట్టాలు న్యాయవాదులకే ఉపయోగపడుతున్నాయి. కొత్త కోడ్ చట్టమై అమలు లోకి వచ్చేసరికి 2011 వరకు సమయం పట్టవచ్చు’ అని చిదంబరం చెప్పారు.
Pages: 1 -2- News Posted: 12 August, 2009
|