సెకండ్ మార్కెట్లో నానో
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత చౌక అయిన కారు నానో తాళం చెవులను తొలి కొనుగోలుదారుకు టాటా గ్రూప్ చైర్మన్ రతన టాటా అందజేసి రెండు నెలలు కూడా కాకుండానే ఆ కారు 'యూజ్డ్-కార్' (సెకండ్ హాండ్) మార్కెట్ కు చేరుకున్నది. బుకింగ్ ధర కన్నా 18 శాతం నుంచి 20 శాతం అధికంగా రూ. 25 వేలు, రూ. 35 వేలు మధ్య ఆ కారు ధర పలుకుతున్నది.
పరిమిత కేటాయింపులు, సుదీర్ఘ నిరీక్షణ కాలం ఈ ప్రీమియం సెకండ్-హాండ్ ధరలకు ముఖ్య కారణాలని యూజ్డ్ కార్ల డీలర్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, లక్ష కార్ల మొదటి కేటాయింపు జాబితాలో పేర్లు చోటు చేసుకన్న కస్టమర్లు తక్కువ ప్రీమియంలకైనా తమ కేటాయింపులను విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. ఉదాహరణకుక డిసెంబర్ లో అందజేసే కార్లకు ప్రీమియం రేట్లు రూ. 5000 నుంచి రూ. 8000 వరకు ఉన్నాయి. (అయితే, కేటాయింపులు ఒరిజినల్ కొనుగోలుదారుకే జరుగుతాయి.)
'ఈ కొనుగోలుదారులలో మొదటి అలాట్ మెంట్ డ్రాలో అవకాశం కోల్పోయిన వారు లేదా వాటిని బుక్ చేయాలనుకోనివారు ఎక్కువగా ఉన్నారు. వారు బాగా సంపన్నులు, నాలుగైదు కార్లు ఉన్నవారు. అందువల్ల అదనపు చెల్లింపులకు వారు వెనుకాడరు' అని ఫాజుల్ భాయ్ మోటార్స్ సంస్థ డైరెక్టర్ ఆరిఫ్ ఫాజుల్ భాయ్ చెప్పారు. ముంబైలో ఫాజుల్ భాయ్ మోటార్స్ నుంచి 8 నుంచి 10 వరకు నానో మోడల్ కార్లు అమ్మగా వాటిని షోరూమ్ కు తీసుకువచ్చే లోపలే వాటి పునర్విక్రయాలు జరిగిపోయాయి.
ఇప్పుడు అమ్ముకుంటున్నవారు డబ్బు అవసరమైనవారో లేదా కారు డెలివరీ అయ్యే వరకు నిరీక్షించలేనివారో అవుతున్నారు. కంపెనీ తన కొనుగోలుదారులకు అందజేసిన సమాచారం ప్రకారం కారు డెలివరీకి మూడు నెలల నుంచి ఒక ఏడాది వరకు వ్యవధి పట్టుతుంది.
Pages: 1 -2- News Posted: 21 September, 2009
|