పెట్రో కారిడార్ కు శ్రీకారం
హైదరాబాద్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెట్రో కారిడార్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం, కాకినాడ మధ్య అభివృద్ది చేయదలచిన పెట్రో రసాయన ఉత్పత్తుల పెట్టుబడుల రీజయన్(పిసిపిఐఆర్)పై గురువారం కేంద్ర పెట్రో రసాయనాల శాఖతో అవగాహన ప్రతాల సంతకాలు జరిగాయి. ఈ ఒప్పదంలో భాగంగా రూ. 19,031 కోట్ల రూపాయల ఖర్చతో పెట్రో కారిడార్ కోసం రోడ్లు, రైల్వేలైన్లు ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వినియోగించనున్నాయి. దీనిలో కేంద్ర ప్రభుత్వం రూ. 6,334 కోట్లు అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2132 కోట్లు, ప్రైవేట్ సంస్థలు రూ. 10,565 కోట్లు పిసిపిఐఆర్‌లో మౌలిక సదుపాయాల వృద్ధికి వినియోగించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలి పింది. గురువారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి బి శ్యాంబాబ్, ఎపిఐఐసి సిఎండి బిపి ఆచార్య, పెట్రోకెమికల్స్ సంయుక్త కార్యదర్శి నీల్ కమల్ దర్బారీ తదితరలు పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టును తన్నుకుపోవడానికి పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ముమ్మరంగా పోటీపడగా, చివరకు మన రాష్టమ్రే పిసిపి ఐఆర్ సాధించడంతోపాటు, అవగాహన ప్రతాలపై సంతకం చేసిన తొలి రాష్ట్రంగా చోటుచేసుకోవడం విశేషమని ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సాధన ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ కల నెరవేరిందని ఆయన చెప్పారు. వైఎస్‌ఆర్ కేంద్రంపై ఒత్తిడి చేయడం వల్లే ఈ ప్రాజెక్టు రాష్ట్రా నికి లభించిందని, దీంతో కాకినాడ, విశాఖ మధ్య విసృ్తత స్థాయిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయవచ్చునని అన్నారు. రాష్ట్రంలో పిసిపిఐఆర్ ఏర్పా టు చేయడం ద్వారా రూ. మూడు లక్షల కోట్ల పెట్టుబడులు లభించే అవకాశం ఉందని, ఇప్పటికే రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు లభించినట్లు ఆయన తెలి పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభి స్తాయని ఆయన పేర్కొన్నారు.
పెట్రోకారిడర్‌పై కేంద్ర రసాయనాలు, పెట్రోలియం శాఖతో అవగాహన ఒప్పందం జాప్యం కావడంతో పిసిపిఐఆర్ ప్రాజెక్టుపైనే పలు అనుమానాలు రేకెత్తాయి. ఈ క్రమంలో రాష్ట్ర అధికారుల్లో కొంత ఆందోళన చోటు చేసు కుంది. నాడు వైఎస్‌ఆర్ ఢిల్లీలో చక్రం తిప్పడంతో ఎట్టకేలకు కేంద్రం ఆంధ్ర ప్రదేశ్‌తో ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విశాఖ, కాకినాడ మధ్య 1,49,146 ఎకరాల్లో పిసిపిఐఆర్ బహుళప్రాజెక్టును అభివృద్ది చేయనున్నారు . పిసిపిఐఆర్ పరిధిలో ఇప్పటికే విసృ్తత స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక మండళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తు న్నాయి. ఎపిఐఐసి ఏపీసెజ్, రామ్‌కీ ఫార్మా, బ్రాండిక్స్ వంటి సంస్థలు ఇప్పటికే ఉత్పత్తి పనులు చేపట్టాయి.
Pages: 1 -2- News Posted: 2 October, 2009
|