విప్రోతో చేయి కలిపిన జీఈ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంస్థ జీఈ హెల్త్‌కేర్ బిజినెస్ యూనిట్లును భారత్‌లో ఏర్పాటు చేయడానికి ఐటీ దిగ్గజం విప్రోతో చేతులు కలిపింది. 51 శాతం వాటాతో జీఈ, విప్రోతో జాయింట్ వెంచర్ ప్రారంభించింది. జీఈకు చెందిన హెల్త్ కేర్, మెడికల్ డయాగ్నోస్టిక్ ఉత్పత్తులను భారత్‌లో విప్రో పంపిణీ చేయనుంది. భారత్‌లో కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయ డానికి ఉపయోగకరంగా ఉంటుంది. అనేక మార్కెట్లు ఇందులోకి ప్రవేశిస్తాయి’ అని జీఈ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రే ఆర్ ఇమ్మెల్ట్ తెలిపారు.
జీఈ హెల్త్‌కేర్ లైఫ్ సైన్సెస్, జీఈ హెల్త్‌కేర్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, జీఈ మెడికల్ సిస్టమ్స్ ఇండియా వంటి ఇన్‌కార్పొరేట్ యూనిట్లను ప్రస్తుతం విప్రో హెల్త్‌కేర్ ఏర్పాటు చేస్తోంది. దాదాపు 20 శాతం ఉత్పత్తులను భారత్‌లో విక్రయి స్తాం. అవి ఇక్కడే తయారవుతాయి. భవిష్యత్తులో ఈ శాతాన్ని పెంచాలని కంపె నీ యోచిస్తోంది. అని ఇమ్మెల్ట్ తెలిపారు. ‘వచ్చే 5-10 ఏళ్ల లో, భారత్‌లో ఉత్పత్తుల విక్రయాలు దాదాపు 50-70 శాతానికి పెరగవచ్చని భావిస్తున్నారు. ఇక్కడే వృద్ధి చేస్తాం, తయారు చేస్తాం. అంతే కాకుండా కొంత వాటిని క్రమంగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తాం అని ఇమ్మెల్ట్ అన్నారు.
Pages: 1 -2- News Posted: 3 October, 2009
|