రిలయన్స్ దీపావళి బోనస్
ముంబాయి : ప్రైవేటు రంగంలో విజయవంతంగా నడుస్తున్న అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వాటాదారులకు దీపావళి ధమాకా ప్రకటించింది. పుష్కర కాలం (12 సంవత్సరాలు) తరువాత పెద్ద మొత్తంలో రిలయన్స్ తన 35 లక్షల మంది వాటాదారులకు 1:1 నిష్పత్తిలో ఉచిత షేర్లను బోనస్ గా ప్రకటించింది. దీనికి తోడు పది రూపాయల ముఖ విలువ గలిగిన ప్రతి షేరుకూ 13 రూపాయల డివిడెండ్ ప్రకటించింది. అంటే 130% లాభాన్ని పంచిపెట్టాలని నిర్ణయించింది. 1997 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాగే 1:1 నిష్పత్తిలో షేర్లను తన వాటాదారులకు అందజేసింది. బోనస్ షేర్లు ఇవ్వాలంటూ గత కొద్ది సంవత్సరాలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి వాటాదారుల నుంచి నిరవధికంగా వస్తున్న డిమాండ్ కు సమాధానంగా ఆయన ఇంత భారీ ప్యాకేజ్ తో ముందుకు వచ్చారు. వచ్చే దీపావళి పండుగకు పదిరోజుల ముందు మొత్తం 164 కోట్ల షేర్లను తమ సంస్థ వాటాదారులకు ఉచితంగా అందించేందుకు ఆయన ఈ ప్యాకేజ్ ను సిద్ధం చేశారు.
'బారత కార్పొరేట్ రంగ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఉచిత బోనస్ షేర్లను పంచిపెట్టిన సంస్థల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థానం సంపాదిచనున్నది. రిలయన్స్ సంస్థ ఇంత పెద్ద మొత్తంలో ఉచితంగా బోనస్ షేర్లను ప్రకటిస్తుందన్న విషయాన్ని అస్సలు ఊహించలేదు' అంటూ క్రిస్ సంస్థ డైరెక్టర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారు కూడా అయిన అరుణ్ కెజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 8 October, 2009
|