బ్యాంకు సిబ్బందికీ పెన్షన్
న్యూఢిల్లీ : 2010 ఏప్రిల్ 1 రాగానే దేశంలో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ కొత్త పెన్షన్ విధానం (ఎన్ పిఎస్)కు మారిపోతుంది. ఎన్ పిఎస్ కు పెద్ద ఊపు ఇచ్చే చర్యగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) పిఎఫ్ఆర్ డిఎతో ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందం కింద, అసోసియేషన్ లో భాగమైన బ్యాంకులలో కొత్తగా ఉద్యోగాలలోచేరేవారు కటాఫ్ తేదీ నుంచి ఈ ప్రత్యేక కాంట్రిబ్యూషన్ పథకంలో తప్పనిసరిగా చేరవలసి ఉంటుంది.
కొత్త విధానాన్ని అనుసరించనున్న బ్యాంకులలో 20 జాతీయ బ్యాంకులు, డజను పైచిలుకు ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. కార్పస్ మేనేజ్ మెంట్ నిబంధనల కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) ఇప్పటికే పిఎఫ్ఆర్ డిఎతో ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఐబిఎతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి నిజమేనని పిఎఫ్ఆర్ డిఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాణి ఎ నాయర్ 'ఫైనాన్షియల్ క్రానికల్' (ఎఫ్ సి) విలేఖరికి తెలియజేశారు. '2010 ఏప్రిల్ 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకానికి మారడానికి ఐబిఎ మాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది' అని నాయర్ తెలిపారు. బ్యాంకులు, ఐబిఎ మధ్య తొమ్మిదవ ద్వైవార్షిక వేతనాల ఒప్పందంలో భాగమైన బ్యాంకులన్నీ ఐబిఎ మినహా ఈ కొత్త విధానానికి మారనున్నాయని నాయర్ తెలిపారు.
Pages: 1 -2- News Posted: 16 December, 2009
|