రియల్టర్ల కొత్త ఎత్తులు!
న్యూఢిల్లీ : 2009లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పుడు తీవ్రంగా నష్టపోయిన రియల్ ఎస్టేట్ పరిశ్రమ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నది. 2010 కేంద్ర బడ్జెట్ నుంచి ఈ పరిశ్రమ ఆశిస్తున్న రాయితీలలో కొన్ని పాత డిమాండ్లతో పాటు కొత్తవి కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో 70 శాతం పైగా వాటాను ఆక్రమిస్తున్న హౌసింగ్ రంగంలో 202 నాటికి దాదాపు 26.53 మిలియన్ల ఇళ్ల కొరత ఉండగలదని భావిస్తున్నారు. ఈ పరిశ్రమ డిమాండ్లలో చాలా వరకు ఈ అవసరాన్ని తీర్చడానికి ఉద్దేశంచినవే.
ప్రస్తుతం ఇంటి రుణం వడ్డీ చెల్లింపుపై లక్షన్నర రూపాయల మేరకు మినహాయింపు లభిస్తున్నది. ఇంటి రుణంపై సాలుకు పది శాతం వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత మినహాయింపు వల్ల గృహ కొనుగోలుదారులకు 15 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరుతున్నది.
నగరాలలో ఆస్తుల విలువ ఈ మొత్తం కన్నా బాగా అధికంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 'ఈ పరిమితిని కనీసం 3 లక్షల రూపాయల వరకు పెంచాలని మేము సిఫార్సు చేస్తాం. ఇంకా వడ్డీ మినహాయింపు ప్రయోజనాన్ని లబ్ధిదారు ఆదాయంతో ముడిపెట్టవచ్చు. నిర్దుష్ట ఆదాయం పరిమితి కన్నా తక్కువ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ మినహాయింపు వల్ల ప్రయోజనం కలుగుతుంది' అని నైట్ ఫ్రాంక్ ఇండియా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రణబ్ దత్తా చెప్పారు.
ఇంటి రుణం తిరిగి చెల్లింపునకు లక్ష రూపాయల మేరకు విడిగా మినహాయింపు ఇవ్వాలని లేదా మొత్తం మినహాయింపును రూ. 2 లక్షలకు హెచ్చించాలని డెవలపర్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. మినహాయింపు పరిమితిని పెంచితే, నిర్దుష్ట ఆదాయం వరకు వ్యక్తులకు ఈ మినహాయింపును పరిమితం చేయవచ్చు. అందుబాటులో గృహవసతి అనేది చివరకు పెద్ద సంస్థలకు కూడా కొత్త మంత్రంగా ఉంటున్నందున సెక్షన్ 80 ఐబి (10) కింద ఆదాయం పన్ను (ఐటి) మినహాయింపును 2008 మార్చి 31 తరువాత నిర్మించిన ప్రాజెక్టులకు కూడా వర్తింపచేయాలని రియల్టర్లు కోరారు. ఈ సెక్షన్ కింద ప్రయోజనాలు అసలు ఉద్దేశించిన లబ్ధిదారులకు అందడం లేదు. కొన్ని లొసుగులను 2009-10 బడ్జెట్ లో సరిచేశారు. కాని మధ్య తరగతివారి సహాయార్థం చేయవలసింది ఇంకా ఎంతో ఉంది.
Pages: 1 -2- News Posted: 9 February, 2010
|