మైక్రో ఒవెన్ వంటపై డౌట్స్
న్యూఢిల్లీః ఇంటిపనిని సులువు చేసేందుకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం అందించిన గృహోహకరణాల్లో మైక్రోఒవెన్ ఒక వరం లాంటిది. మైక్రోవేవ్ ఒవెన్ వంట చేసే సమయాన్ని,విసుగును తగ్గిస్తుంది.ఈ ఒవెన్ వల్ల వంటను మరింత సరదాగా, మరింత సులువుగా చేసేందుకు అవకాశం కలిగింది. ఈ ఒవెన్లు గృహిణుల ముఖాలపై చిరునవ్వులు తెప్పించాయి. వంటగదిలో మహిళలు విసుగుపుట్టేట్లు శ్రమపడవలసిన అవసరంలేకుండా ఒనెన్లు ఒకమేరకు స్వేచ్ఛను ప్రసాదించాయి. అయితే ఈ మైక్రోఒవెన్ వినియోగం ఏ మాత్రం సురక్షితమన్న విషయంపై ప్రపంచంలో రెండు భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అయితే ఏవిషయమూ ఇప్పటికీ పూర్తిగా నిర్ధారణ కాలేదు.గతంలో రిఫ్రరిజెరేటర్్, డిష్ వాషర్, ఫుడ్ ప్రాసెసర్లపై రేగిన చర్చల్లాగే మైక్రోవేవ్ ఒవెన్ పై కూడా పలు వాదోపవాదాలు జరుగుతున్నాయి.
మైక్రోవేవ్ ఒవెన్లలో వండిన ఆహారం అనారోగ్యం కల్గిస్తోందని కొందరు పరిశోధకులు వాదిస్తున్నారు.అయితే వేరెవరికి ఒవెన్ల మంచి చెడ్డల గురించిన అభిప్రాయంగాని,స్పృహగాని లేనే లేదు. ఒవెన్ ఉత్పత్తిదారులు మాత్రం రెండవ అభిప్రాయ వర్గంలోకి వస్తారు. వారికి ఒవెన్ పట్ల అనుకూల అభిప్రాయమే ఉంది. అమెరికా ప్రభుత్వ పరిశోధక ఏజెన్సీలు, ప్రైవేట్ సంస్థలు ఒవెన్ వల్ల కలిగే అనర్ధాలపై పలు అధ్యయనాలు చేశాయి. అయితే ఒవెన్ వంటకాల వల్ల అనారోగ్యం వస్తుందన్న అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఆరోపణలను పై అధ్యయనాలు ఇప్పటివరకు ధృవీకరించలేదు. మైక్రోవేవ్ వంటతో అనారోగ్యకరమన్న విస్తృత శాస్త్రపరిశోధనలున్నప్పటికీ ఆ అధ్యయనాలు ఏ ఒక్కటీ ఆ విషయాన్ని ధృవీకరించలేదు.
మైక్రోఒవెన్ తో అనారోగ్యం వస్తుందని అమెరికా, పిట్స్ బర్గ్ కార్నెగి మెల్లన్ విశ్వవిద్యాలయం డాక్టోరల్ స్కాలర్ వరుణ్ దత్ పరిశోధనలు వెల్లడించాయి.క్రోవేవ్ ఒవెన్ లో వండిన వంటకాలు ప్రాణాంతకంగా మారుతాయన్న విషయంపై ఎలాంటి శాస్త్ర నిర్ధారణ జరగలేదని శ్యామ్ సంగ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.మైక్రోవేవ్ ఒవెన్ లో వండిన వంటకాలు పోషకవిలువలను కోల్పోతాయని పలువురు ఆందోళన చెందే విషయాన్ని శ్యామసంగ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ జుషి అమోదించారు.మైక్రోవేవ్ ఒవెన్ లో మేము బయో ఎనామిల్ కేవిటీని ఏర్పాటు చేయడం ద్వారా వంటకాల్లోని పోషకవిలువలను నిరోధిస్తున్నామని జుషి తెలిపారు. ప్రజల్లో స్పృహ లేకపోవడం ఉత్పత్తి దారులకు సంతోషపడుతున్నారు. అమెరికాలో 90 శాతం ఇళ్లలో మైక్రోవేన్ ఒవెన్ లున్నాయి. భారత్ లో 100కోట్లకు మించి జనాభా ఉన్నప్పటికీ మైక్రోవేవ్ ఒవెన్ మార్కెట్ నామమాత్రంగానే ఉంది. దేశంలో 12 లక్షల మైక్రోవేవ్ ఒవెన్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ సంఖ్య ఏడాదిగి నాల్గవ వంతు పెరగుతోంది.
ఎల్ జి సంస్థ మేనేజ్ మెంట్ మైక్రోవేవ్ ఒవెన్ పట్ల అనుకూలంగానే ఉంది. మైక్రోవేవ్ వంటలో ఎలాంటి ప్రమాదాలుండవు అని ఎల్ జి ఇండియా ప్రతినిధి రాజీవ్ జైన్ తెలిపారు. మైక్రోవేవ్ ఒవెన్ వంట పట్ల గాడ్రెజ్ సంస్థకు వ్యతిరేక అభిప్రాయాలున్నాయి.దాంతో గాడ్రెజ్ సంస్థ స్టీమ్ మైక్రోవేవ్ ను కొత్తగా రూపొందించింది. ఈ స్టీమ్ మైక్రోవేవ్ ఒవెన్ లో మైక్రోవేవ్ తోపాటు,స్టీమ్ కూడా విడుదలవుతుంది.హెయర్ సంస్థ కూడా మైక్రోవేవ్ వంటపై కాకుండా వినియోగంపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగిఉంది.మైక్రోవేవ్ ఒవెన్ లో వంటహానికరమైన విషయం ఇప్పటికింకా నిర్ధారణ కాలేదని, అయితే మైక్రోవేవ్ లీకేజి వల్ల వంచ చేసే వ్యక్తులకు హాని జరుగుతుందని హయర్ కంపెనీ డైరెక్టర్,చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రణయ్ థబాల్ తెలిపారు.మన న్యూట్రిషినిస్టులు ఈ విషయంపై ఎలాంటి అభిప్రాయాలను మిశ్రమంగా వ్యక్తం చేస్తున్నారు.'మైక్రోవేవ్ వంటపై పలు వివాదాస్పద నివేదికలు వెలువడ్డాయి. ఈ గందరగోళాన్నినివృత్తి చేసే సరైన సమాచారం నాకింత వరకు అందుబాటులోకి రాలేదు. అయితే భారత దేశంలో చల్లారిన ఆహారాన్ని వేడిచేసుకునేందుకు మైక్రోఒవెన్ లను ప్రధానంగా వినియోగిస్తుంటారు.వంటకాలను వండేందుకు మైక్రోవేవ్ ఒవెన్ లను వినియోగించేవారి సంఖ్య చాలా స్వలంప్'అని ప్రముఖ డైటీషియన్ శిఖ శర్మ తెలిపారు. 'మైక్రోవేవ్ వంట వలన ఖచ్చితంగా ఏంతో కొంత హానీ జరగేందుకు అవకాశముంది. అయితే ఏ మేరకు హాని జరుగుతుందో ఇంతవరకు ఎలాంటి అధ్యయనాలు రాలేదు. అందువల్ల మధ్యేమార్గంగా మైక్రోవేవ్ ను సాధ్యమైనంత తక్కువగా వినియోగిస్తే మంచిది' అని మరో డైటీషియన్ ఇషా ఖోస్లా తెలిపారు.
మైక్రోవేవ్ లో వండిన వంటకాలను నిరంతరాయంగా తింటే ఎలక్ట్రికల్ ఉద్దీపనలు 'దెబ్బతిని'పోయి మెదడు శాశ్వతంగా పాడైపోయే ప్రమాదముందని కాలమిస్టు దత్ తన వ్యాసంలో వివరించారు. మైక్రోవేవ్ వంటలో వంటకాల్లో ఏర్పడే అజ్ఞాత రసాయనిక పదార్ధాలతో వ్యవహరించే విధి విధానాలు మానవ శరీరానికి తెలియదు. దాంతో శరీరంలోని హార్మాన్్ ఉత్పత్తి దెబ్బతినిపోవచ్చు లేదా మందగించవచ్చు. కూరగాయల్లోని మినరల్ పదార్ధాలు కేన్సర్ ఫ్రీరాడికల్స్ గా మారనూవచ్చు. మైక్రోవేవ్ వంటకాల వల్ల కడుపులో అల్సర్లు, ట్యూమర్లు ఏర్పడే అవకాశముంది. మైక్రోవేవ్ వినియోగం అధికంగా ఉన్న అమెరికాలో కొలన్ కేన్సర్ కేసులు కూడా అధికంగా ఉన్నాయి.మైక్రోవేవ్ వినియోగం వలన 'జంక్'వంటకాలు తయారవుతున్నాయి.
ప్రజల్లో ఈ స్పృహ తక్కువగా ఉండడంతో చాలా ఫుడ్ చైన్స్ మైక్రోవేవ్ లను విచక్షణారహితంగా విస్తృతంగా వినియోగిస్తున్నాయి. కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కెఎఫ్ సి)మైక్రోవేవ్ ఒవెన్ లను వేడి చేసేందుకు మాత్రమే విస్తృతంగా వినియోగిస్తోంది. ఈ సంస్థ మైక్రోవేవ్ వినియోగం హానికరంగా పరిగణించదు.ఈ ఉపకరణాల్లో విడుదలయ్యే మైక్రోవేవ్ చాలా బలహినమైనవి. అదీ కాకుండా ఈ మైక్రోవేవ్స్ ను నీటి అణువులు శోషిస్తాయి. నీటిపై మాత్రమే దాని ప్రభావముంటుంది. ఆహారంపై ఎలాంటి ప్రతికూల ప్రభావముండదని కెఎఫ్ సి ఆర్ అండ్ డి అధిపతి విజయ్ సుకుమార్ తెలిపారు.
News Posted: 9 February, 2009
|