హైదరాబాద్: 'నీవే నా సర్వం అనుకొని జీవించా....నీవే నా సర్వస్వం అనుకొని కలలు గన్నాను....నీవే నా ప్రేమను తిరస్కరించాక ఈ జీవితం ఎందుకు అని అనుకున్నా'.....అని ప్రియురాలి పేరిట కవిత రాసిన ఓ భగ్న ప్రేమికుడు శనివారం ఆత్మహత్యాయత్నకు పాల్పడ్డాడు. ప్రేమ పక్షులు ఆనందంగా వేడుక చేసుకునే వాలెంటైన్‌స డే రోజున ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రేయసితన ప్రేమను నిరాకరించిందన్న విషయాన్ని భరించలేని విద్యార్ధి పురుగుల మందు తాగి బలవన్మరణం పొందాడు.
నగరంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటన శనివారం బంజారాహిల్‌స పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కధనం ప్రకారం కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన కె కార్తీక్ (25) డిగ్రీ పూర్తి చేసి ఐ సెట్ రాసేందుకు శనివారమే నగరానికి వచ్చాడు. బంజారాహిల్‌స రోడ్డు నెంబరు 2లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వెనుక ఓ గదిని నాలుగు రోజుల కోసం అద్దెకు తీసుకున్నాడు. కొద్ది సేపు పడుకున్న తరువాత బయటకు వెళ్లి టిఫిన్ తీసుకుని గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకున్నాడు.
సాయంత్రం ఇంటి పక్కనే ఉండే వీణమ్మ కార్తిక్ గది తలుపును కొట్టింది. ఎన్నిసార్లు పిలిచినా ఎవరరూ పలకకపోవడంతో ఆమె ఈ విషయాన్ని ఇంటి యజమానికి తెలియజేయగా ఆయన బంజారాహిల్‌స పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులను పగులగొట్టగా కార్తిక్ అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. అస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. సంఘటనా స్థలం వద్ద పోలీసులు కవితలతో నిండి ఉన్న అతని డైరీని స్వాదీనం చేసుకున్నారు.
తన మరదలు తన ప్రేమను అంగీంకరించకపోవడం వల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసాడు. వీటిని పోలీసులు స్వాదీనం చేసుకొని ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.