ఐశ్వర్య 'పన్ను'నొప్పి
ముంబాయి: లాంజిన్స్ వాచీల కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఆర్జించిన ఆదాయంపై బాలివుడ్ నటి ఐశ్వర్య రాయ్ కోరిన పన్ను మినహాయింపుకు ఇన్ కం టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎలా స్పందిస్తుందోనని హిందీ చలనచిత్ర పరిశ్రమ ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది. ఈ వారం ప్రారంభంలో విచారణకు వచ్చిన ఈ కేసు మార్చి నెలాఖరుకు వాయిదా పడింది. ఇటువంటి పన్ను మినహాయింపులను కోరుతున్న చాలామంది సినీ ప్రముఖులు ఐశ్వర్య తేసు తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు. 2006లో స్టేజిషోల ద్వారా లభించిన ఆదాయంలో కొంత భాగంపై పన్ను మినహాయింపు పొందిన ఐశ్వర్య ఆ తరువాత లాంజిన్స్ కాంట్రాక్టు విషయంలో అటువంటి మినహాయింపు పొందలేక, అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఐశ్వర్య 2002-2003లో లాంజిన్స్ వాచీల కంపెనీ భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ గా కోటి రూపాయలుపైగా కాంట్రాక్టుపై నియమితురాలయింది. ఈ మొత్తంలో 30 శాతం- 30 లక్షల రూపాయలు ఆదాయం పన్ను మునహాయింపు కోరుతూ ఆమె చేసుకున్న దరఖాస్తును అసెసింగ్ అధికారి తిరస్కరించారు. ీ నిర్ణయాన్ని ఇల్ కం టాక్స్ కమిషనర్ కూడా సమర్ధించడంతో ఆమె ఐటి ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది.
News Posted: 15 February, 2009
|