రికార్డు ముద్దులు
మెక్సికో సిటీ: ఏ జంట ఎంత ఎక్కువ సేపు ముద్దు పెట్టుకున్నారన్న రికార్డు పాతబడిపోయింది. ఒకచోట ఎంత ఎక్కువమంది ముద్దు పెట్టుకున్నారన్నది మొన్నటి రికార్డు. మెక్సికో సిటీలో ఈ రికార్డు నమోదయింది. గిన్నిస్ ప్రపంచ రికార్డుల ప్రతినిధి కార్లోస్ మార్టినెజ్ స్వయంగా జరిపిన పరిశీలనలో మొత్తం 39,897 మంది ఈ నగరంలోని జొకాలొ మెయిన్ స్క్వేర్ లో వాలెంటైన్స్ డే నాడు ముద్దుల వేడుకలో పాల్గొన్నట్టు వెల్లడయింది. ఇది 2007లో వెస్టన్-సూపర్-మేర్ అనే ఇంగ్లీషు పట్టణం రికార్డును అధిగమించింది. 'మేం సాధించాం. లాంగ్ లివ్ మెక్సికో' అని అంతకుముందు తన పాటలతో జంటలను మైమరపించిన మెక్సికన్ నటి, గాయకురాలు సుసానా జవలెటా అంది. ఈ వేడుక పేరిట 'బిసామె ముచో'(కిస్ మి ఎ లాట్) అనే శాస్త్రీయ గీతాన్ని కూడా ఆమె ఆలపించింది.
నగరంలోని ప్రకుల్లో, వీధుల్లో ఈ రోజు ఎంతోమంది ఈ వేడుక జరుపుకుంటారు. ఎవరికి వారే ఆనందించే బదులు అందరూ ఒకచోట చేరి వేడుక జరుపుకోవడం, అభిమానాన్ని, అనుభూతిని ఇతరులతో పంచుకోవడం అనేది ఎంతో ఉత్సాహాన్నిచ్చే ఆలోచన అని 53 సంవత్సరాల షాపు ఉద్యోగి బెనిటొ జవలా అన్నాడు. ఈ సందర్భంగా మెక్సికో సిటీలో హింసరహిత సంబంధాలు, ఎయిడ్స్ నిరోధంపై వర్క్ షాపులు కూడా నిర్వహించారు. ముద్దు వేడుక పూర్తికాగానే ప్రముఖ గాయని విన్సెటి ఫెర్నాండెజ్ కచేరి జరిగింది.
News Posted: 15 February, 2009
|