పద్యం ఆందోళనకు పథ్యం
లండన్: అంతర్, బహిర్ ప్రపంచాన్ని పరిశీలించి లయ సమన్వితంగా, హృద్యంగా అక్షరబద్దం చేయడమే పద్య రచన. అయితే పద్య రచన ఆరోగ్యానికి మంచిదని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎలాంటి పద్య రచన అయినప్పటికీ మెదడులోని అల్లకల్లోన్ని స్వాంతన పరుస్తుంది. ఉద్రిక్త భావాలను ఉపశమింపచేస్తుంది. భయం, బాధ, దిగులు, విచారాన్ని నివారిస్తుంది. చిన్నదిగా, భావోక్తిగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచి చేస్తుందని ఆ అధ్యయనం వెల్లడించింది.
ఒక వ్యక్తి తనలోని భావావేశాన్ని కాగితం మీద రాయడం ద్వారా తన అంతరంగ కల్లోలానికి కళ్లెం వేయగలడు. మెదడులోని పలు ప్రాంతాల్లోని ఉద్రిక్తతను ఉపశమిస్తుంది. ఆత్మ నియంత్రణతో కార్యకలాపాన్ని చేసేందుకు అవకాశముంటుంది. 'మన ఆందోళనను నియంత్రించేందుకు పద్య రచన మంచి సాధనంగా ఉపకరిస్తుంది. ప్రజలు తమ ఆందోళనను తగ్గించుకునేందుకు అది పనిగా కృషి చేయవలసిన అవసరం లేదు.చాలా మంది డైరీలు రాయడం, పాటలకు తప్పుడు సాహిత్యాన్ని జత చేసే పనులు కూడా ఆయా వక్తుల కల్లోల అంతరంగాన్ని శాంతపరుస్తుంది' అని కాలిఫోర్నియాకు విద్యాలయ ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ మాథ్యూ లిబర్ మన్ తెలిపారు.
News Posted: 16 February, 2009
|