ఒకటి కొంటే వంద డ్రస్స్ లు
లండన్: బై వన్, గెట్ వన్ అని షాపింగ్ మాల్స్ లో ఊదరగొట్టడం మనం తరచూ చూస్తుంటాం. ఒక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సెబాషియన్ ఎర్రాజురిజ్ ఒక విలక్షణమైన, విచిత్రమైన డస్స్ ను రూపొందించి సంచలనం సృష్టించారు. ఆ డ్రస్స్ ను వంద రకాలుగా వేసుకోవచ్చు. అంటే ఒక డ్రస్స్ కొంటే దాన్ని వంద రకాల డ్రస్స్ లు గా మలచుకునే వీలుంటుంది. 120 ప్రత్యేకమైన జిప్పులతో బ్లాక్-సిల్వర్ రంగుతో ఈ డ్రస్స్ రూపొందింది. అందువల్ల దానికి 'జిప్పర్' అని నామకరణం చేశారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కరిగిపోయిన పరిస్థితుల్లో పొదుపుకు ప్రతీకగా నిలిచే వంద రకాలుగా వేసుకోగల్గే ఈ డ్రస్స్ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.
ఈ డ్రస్స్ లోని 120 జిప్పులను పలు రకాలుగా కలపడం, తొలగించడం ద్వారా లెక్కలేనన్ని కాంబినేషన్ డిజైన్లతో డ్రస్స్ లను రూపొందించవచ్చు. బెల్ట్ మొదలుకుని పూర్తి స్థాయి నైట్ డ్రస్స్ వరకు ఈ డస్స్ ను సరిచేసుకోవచ్చు. నెక్ లైన్, డ్రెస్ లెంగ్త్, స్లీవ్ లెంగ్త్ లాంటి పలు రకాల దుస్తులుగా ఈ డ్రస్స్ ను సులభంగా మలచుకోవచ్చు. ఈ డ్రస్స్ మధ్యలోని జిప్పులను తొలగించడం ద్వారా టూ పీస్ మినీ స్కర్ట్ ను, క్రాప్-టాప్ ను రూపొందించవచ్చని డైలీ టెలిగ్రాఫ్ వెల్లడించింది.
'ఫ్యాషన్ ప్రపంచం డిమాండ్లను, మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ డ్రస్స్ ను రూపొందించాము. వందలాది రకాల ఫ్యాషన్ డ్రస్స్ లను ఒకే డ్రస్స్ ద్వారా రూపొందించుకునే వీలున్న డ్రస్స్ ను రూపొందించాలన్న మా సంకల్పాన్ని విజయవంతంగా పూర్తి చేయగల్గాము. ఈ జిప్పర్ డ్రస్స్ ని పూర్తి స్థాయి నైట్ డ్రస్స్ గాను, టి షర్ట్ గాను, మిని స్కర్ట్ గాను, చివరికి బెల్ట్ గాను సులభంగా మలచుకోవచ్చు. ఈ డస్స్ లోని ప్రతి భాగాన్ని పూర్తిగా విడగొట్టగలం లేదా డస్స్ కే వేలాడేట్టు చేయగలం లేదా డ్రస్స్ లోపలికి మడిచేసి కనపడకుండై ఉండేట్లు చేయగలం. ఈ భావన ప్రస్తుత ఆర్ధిక సంక్షోభ పరిస్థితులకు తగినట్లు ఉపకరిస్తుంది'అని డిజైనర్ సెబాషియన్ తెలిపారు.న్యాయమైన ధరకు పెద్ద ఎత్తున జిప్పర్ డ్రస్స్ ను మార్కెటింగ్ చేసేందుకు 31 ఏళ్ల ఈ డిజైనర్ పలువురు డెవలపర్స్ తో సంప్రదింపులు చేస్తున్నారు. టోక్యో, న్యూయార్క్, పారిస్ నగరాలతో పలు ప్రాంతాల్లో 40 ప్రదర్శనలను డిజైనర్ సెబాషియన్ నిర్వహించారు.
News Posted: 18 February, 2009
|